Samantha : సినిమాలకు సమంత గుడ్ బై..కారణం అదే?

- Advertisement -

Samantha; సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆమె స్టార్ హీరోయిన్లలో ఒకటి. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల్లో మంచి మార్కులు వేయించుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక మొదటి సినిమా చేస్తున్న టైంలో అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడి చాలా రోజులు రహస్యంగా ప్రేమను నెట్టుకొచ్చారు.కానీ ఎట్టకేలకు ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే మనస్పర్ధలు తలెత్తడంతో విడాకుల వైపు అడుగులు వేశారు..

samantha ruth prabhu
samantha ruth prabhu

కాగా,సమంత విడాకుల తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆ సమయంలో యశోద ,శాకుంతలం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల కోసం జిమ్ లో ఎన్నో వర్కౌట్లు చేస్తూ అలాగే డైట్ మెయింటెన్ చేస్తూ అనారోగ్యానికి గురై హాస్పిటల్ బారిన పడింది. దాంతో సమంత గురించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత మయాసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పడంతో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరికీ చెప్పింది..ఆమె ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.. ఆమె అభిమానులు భాధలో ఉన్నారు.

సమంత గురించి ఒక షాకింగ్ వార్త నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతోంది. అదేంటంటే సమంత ఇకపై సినిమాలకు దూరంగా ఉండబోతుందట. అసలు విషయంలోకి వెళ్తే.. సమంత మయాసైటిస్ వ్యాధి నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంతేకాదు ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారట. దీంతో సమంత తాను ఒప్పుకున్న ఖుషి సినిమాని పూర్తి చేసి కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

- Advertisement -

బాలీవుడ్ లో ఒప్పుకున్న వెబ్ సిరీస్ లు,మూవీలలో కూడా తన ప్లేసులో వేరే వాళ్ళని తీసుకొమ్మని సమంత పిఆర్ టీం ఇప్పటికే వారికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమంత సినిమాలకు దూరంగా ఉంటుంది అని వచ్చే వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..ఈ వార్తల్లో నిజమెంత ఉందో చూడాలి..ఈ వార్త విన్న వాళ్లంతా బాధ పడుతున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here