Samantha : సమంత నిజంగా ఆ హీరో తో డేటింగ్ చేస్తుందా?

- Advertisement -

సమంత Samantha విడాకులు తీసుకున్న తర్వాత అమెపై లేనిపోని కథనాలు బయటకు వస్తున్నాయి..చైతన్య కన్నా ముందే వేరొకరితో ఎఫైర్ ఉందని, చైతన్య కండిషన్లు నచ్చలేదని,అమల ఎదో అందని ఇలా ఒకటేమిటి ఎన్నో వినిపిస్తున్నాయి. వారిద్దరు విడిపోయి సంవత్సరం అయ్యింది. కానీ రుమెర్స్ మాత్రం ఆగలేదు.ఇప్పుడు మరో వార్త షికారు చేస్తుంది..ఆమె ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తుందని త్వరలో వారిద్దరు పెళ్ళి చేసుకోబోతుందనే న్యూస్ కోడ్తె కూస్తుంది..అసలు విషయం ఏంటో,సామ్ నోరు విప్పితేనే తెలుస్తుంది..

ఇకపోతే 2010లో వచ్చిన నాగచైతన్య ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన సమంత ఆ తర్వాత పదేళ్ల పాటు వెనక్కు తిరిగి చూసుకోలేదు.స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టింది. ఒకానొక టైంలో ఆమె కాల్షీట్లు కూడా ఖాళీలేనంత బిజీగా ఉండేది. ఆ తర్వాత నాగచైతన్యతో వరుసగా సినిమాలు చేసింది.. ప్రేమ ముదిరి పాకాన పడడంతో పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -
Samantha
Samantha Naga Chaitanya

పెళ్లి తర్వాత కూడా చైతుతో మజిలీ సినిమా హిట్‌. పెళ్లి తర్వాత కూడా రామ్‌చరణ్‌తో చేసిన రంగస్థలం సూపర్ హిట్‌. ఆ తర్వాత విడాకుల వ్యవహారం తెలిసిందే. విడాకుల తర్వాత కూడా సమంత క్రేజ్ అయితే తగ్గలేదు. రీసెంట్‌గా వచ్చిన యశోద సంచలన విజయం సాధించింది. త్వరలో రిలీజ్ కానున్న గుణశేఖర్ శాకుంతలంపై కూడా మంచి బజ్ ఉంది. ఇక విడాకుల తర్వాత కూడా సమంతకు కుర్ర హీరోలతో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి..ఆమె టాలెంట్ అలాంటిదే..

విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడమే సమంతకు పెద్ద లక్కీ అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా అడవి శేష్‌కు జోడీగా కూడా ఛాన్స్ వచ్చేసింది. శేష్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ 2. హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన హిట్ 2 సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ హిట్ సీరిస్‌ను ఏడు సీరిస్‌లుగా తీసుకు రావాలని శేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడు సినిమాల్లో ఇంకా నలుగురు హీరోలు నటిస్తారట. ఆ హీరోలు ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

ఈ సీరిస్‌లో భాగంగా వచ్చే చివరి సినిమాలో ఇండియన్ లెవల్లో ఏడుగురు హీరోలు ఇన్వెస్ట్‌గేషన్ చేస్తారట. ఇక హిట్ 3 సీరిస్ నుంచి హీరోయిన్‌గా సమంత కూడా ఉండబోతోందట. టోటల్‌గా ఈ సీరిస్ సినిమాల్లో ఇన్వెస్ట్‌గేషన్ చేసే టీంలో ఆమె మెంబర్‌గా నటిస్తుందట. సమంతకు ఈ ఏజ్లో ఖచ్చితంగా ఇది లక్కీ ఆఫరే అని చెప్పాలి. ఆల్రెడీ యశోద సినిమాలో సమంత లేడీ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించి మెప్పించింది..ఇలా వరుస హిట్స్ అందుకుంటున్న సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే..త్వరగా కోలుకొని సినిమాలు చెయ్యాలని ఆమె ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here