Ketika Sharma : ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక హీరోయిన్ కి అవకాశాలు రావాలంటే కచ్చితంగా గ్లామర్ షో చెయ్యాల్సిందే..లేకుంటే అవకాశాలు రావు.. ఎక్కడో అదృష్టం కలిసొచ్చి నటన ద్వారా మాత్రమే నెట్టుకొచ్చే ‘సాయి పల్లవి’ లాంటి హీరోయిన్స్ ఉన్నారు కానీ, తేలిక మార్గం లో అవకాశాలు సంపాదించాలంటే మాత్రం గ్లామర్ షో చెయ్యాల్సిందే..అందుకే ఈమధ్య కుర్ర హీరోయిన్లు సోషల్ మీడియా ని మాధ్యమంగా చేసుకొని హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారులను పిచ్చెక్కించేస్తున్నారు.
అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ‘కేతిక శర్మ’..యూట్యూబ్ లో ‘తగ్ లైఫ్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మాయికి కమర్షియల్ ప్రకటనల్లో నటించే అవకాశం కూడా దక్కింది..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆహా మీడియా కోసం చేసిన ఒక యాడ్ లో కేతిక శర్మ కూడా నటించింది..దానికి ముందు ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ‘రొమాంటిక్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
ఈమె అందచందాలకు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు కానీ, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. ఇక ఆ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘లక్ష్య’ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.. ఇక కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్న ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.. ఇలా కేతిక శర్మ చేసిన ప్రతీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో, ఈ అమ్మడికి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా ఆమె తో సినిమాలు చెయ్యడానికి భయపడుతున్నారు.
ఐరన్ లెగ్ అనే ముద్ర బాగా పడిపోయింది.. అవకాశాలు రావడం బాగా తగ్గిపోవడం తో తన కేతిక శర్మ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులను పిచ్చెక్కిపోయేలా చేస్తుంది.. ఇలా అయినా ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తారో లేదో తెలియదు కానీ, తన అండ చందాలతో మాత్రం యూత్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.