Ketika Sharma: దిల్లున్న దిల్లీ బ్యూటీ కేతిక శర్మ.. నీ అందాలకు కొదవేముందమ్మా..



సోషల్ మీడియా Ketika Sharma ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టి ఒకేసారి టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది దిల్లున్న దిల్లీ అమ్మాయి కేతిక శర్మ. రొమాంటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ దిల్లీ భామ, ఆ తర్వాత టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో నాగశౌర్యతో లక్ష్యలో నటించింది. ఇటీవలే మెగా హీరో పంజా వైష్ణవ్‌తేజ్‌తో రంగరంగ వైభవంగా మూవీతో ప్రేక్షకులను అలరించింది. సినిమా ఆఫర్ల కోసం ఈ బ్యూటీ దిల్లీని వదిలి హైదరాబాద్ వచ్చేసింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ నటిస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ.

Ketika Sharma
Ketika Sharma

దిల్‌ తో పాగల్‌ హై అనే సినిమా చూస్తున్నప్పుడు కేతికకు ఓ వింత డౌట్ వచ్చిందట. అసలు స్క్రీన్‌ మీద మనుషులు ఎలా వస్తారు. వాళ్లు అలా ఎలా అక్కడ డ్యాన్స్ చేస్తారని పెద్ద సందేహం వచ్చిందట. వెంటనే కేతిక వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి తన డౌట్ అడిగిందట. అప్పుడు వాళ్ల అమ్మ మూవీ స్టార్స్, వాళ్ల స్టార్‌ డమ్ గురించి చెప్పగానే తను కూడా యాక్టర్ కావాలని డిసైడ్ అయిందట.

Ketika Sharma Red Dress Photos

ఓవైపు సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు.. మరోవైపు యాక్టింగ్ నేర్చుకుంటుండగా ఒకరోజు ఈ బ్యూటీకి పూరీ జగన్నాథ్ ఆఫీసు నుంచి కాల్ వచ్చిందట. ఫస్ట్ అది ప్రాంక్ కాల్ అని లైట్ తీసుకున్న కేతిక.. తర్వాత అది నిజమే అని తెలుసుకుని భలే హ్యాపీగా ఫీల్ అయిందట. అంతే ఇక రొమాంటిక్‌ కోసం దిల్లీ నుంచి తన మకాం హైదరాబాద్ మార్చేసింది.

Ketika Sharma Red Dress Images

అసలే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఇక తన సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలకు, పోస్టులకు కొదవేం ఉంటుంది. అందుకే ప్రతి రోజు తన ఖాతాలో తన క్యూట్, హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ యువత గుండెల్ని కొల్లగొట్టేస్తోంది ఈ భామ.