Sakshi : ప్రభాస్ – పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఇవ్వాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలి అంటూ ధోని భార్య షాకింగ్ కామెంట్స్

- Advertisement -

Sakshi : క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ని ప్రారంభించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ కి సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాలు మొత్తం ధోని భార్య సాక్షి చూసుకుంటుంది. ఈ బ్యానర్ నుండి తెరకెక్కిన మొదటి చిత్రం LGM (లెట్స్ గెట్ మ్యారీడ్). తమిళ హీరో హరీష్ కళ్యాణ్ మరియు ఇవానా హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Sakshi
Sakshi

దీంతో ఈ సినిమాకి సంబంధించిన మీడియా సమావేశం ని నిన్న ఏర్పాటు చేసింది. ఈ సమావేశం లో మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక మీడియా సమావేశం లో ‘భవిష్యత్తులో మీ యనార్ నుండి ధోని ని హీరో గా పెట్టి సినిమా చేస్తారా’ అని ఒక మీడియా రిపోర్టర్ ప్రశ్న అడుగుతాడు.

అప్పుడు సాక్షి దానికి సమాధానం ఇస్తూ ‘అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను..అన్నీ కలిసి రావాలి’ అని అంటుంది. ఈ ప్రశ్న అయిపోగానే ‘టాలీవుడ్ టాప్ స్టార్స్ అయినా పవన్ కళ్యాణ్,ప్రబస్ వంటి వారితో సినిమాలు చేస్తారా’ అని అడిగిన ప్రశ్నకి సాక్షి సమాధానం ఇస్తూ ‘వాళ్లకి రెమ్యూనరేషన్స్ ఇవ్వాలంటే మా ఆస్తులు అమ్ముకోవాలి. నేను ఇప్పుడే కెరీర్ ని ప్రారంభించాను, ముందు బేస్మెంట్ సరిగా పడనివ్వండి. అప్పుడే అంత పెద్ద స్టార్స్ తో సినిమాలు ఎందుకు’ అని అంటుంది సాక్షి.

- Advertisement -

సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ధోని కి ఉన్న క్రేజ్,బ్రాండ్ ఇమేజి ఈ సినిమాకి ఓపెనింగ్స్ ని తెచ్చిపెడుతుంది అని బలమైన నమ్మకం తో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో, ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి పది కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here