Balakrishna : నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలైన ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద దూమారం రేగుతున్న సంగతి తెలిసిందే.. బాలయ్య వీరసింహారెడ్డి విజయోత్సవం స్టేజ్ పై మాట్లాడుతూ.. ఆ.. రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని అంటూ.. చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీ హీరోలకు వారి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.. దీనిపై పలువురు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని అభిమానులు బాలకృష్ణపై మండిపడుతున్నారు.. తాజాగా ఈ విషయంపై బాలకృష్ణ స్పందించారు..
బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నేను అక్కినేని నాగేశ్వరావు గారిని వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో కించపరిచే విధంగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన మాటలను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్టీఆర్ ఏన్టివోడు అంటారు అది ప్రేక్షకుల అభిమానం.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసతో పిలుస్తూ ఉంటారు.. అదంతా ప్రేమ అభిమానంతో అనే మాటలను వాటిని పట్టించుకోరు. అభిమానంతో అన్న మాటల్ని వ్యతిరేకంగా చూడకూడదు. అక్కినేని నాగేశ్వరరావు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తాను.. పొగడ్తలకు పొంగిపోవద్దని ఆయన నుంచే నేను నేర్చుకున్నాను బాలకృష్ణ అన్నారు. తన పిల్లల కంటే ఎక్కువగా నామీద ప్రేమ చూపించేవారు..
NTR జాతీయ అవార్డు ను ప్రభుత్వం ముందుగా అక్కినేనికే ఇచ్చాము.. అక్కినేని నాగేశ్వరరావు నాకు ఎప్పటికీ బాబాయి. ఆయనకి నేనంటే చాలా ఇష్టం.. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన మహానటుడు ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు ఒకటి ఎన్టీఆర్.. మరొకటి ఏఎన్ఆర్.. అని బాలకృష్ణ అన్నారు..
మొత్తానికి బాలకృష్ణ ప్రేమ కొద్ది అలాంటి మాటలు మాట్లాడాను. కానీ ఆ మాటలు యాదృచ్ఛికంగా వచ్చాయి. కానీ ఆయనపై ఉన్నా అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుందని బాలకృష్ణ అన్నారు ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈ సమస్య ఇక్కడితో సద్దుమణుగుతుందనే అనుకోవాలి. ఆయన నాకు బాబాయి అనే ఒక్క మాటతో బాలకృష్ణ అందరి నోర్లు మూయించారు.