Big Boss Season 7 హోస్టుగా బాలకృష్ణ..?

- Advertisement -

BigBoss Season 7 : నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. బాలయ్య క్రేజ్‌తో ఈ షో సెకండ్ సీజన్‌ కూడా ప్లాన్ చేసింది ఆహా యాజమాన్యం. ఇక సెకండ్ సీజన్‌లో ఓవైపు గెస్టులు.. మరోవైపు వాళ్లతో బాలకృష్ణ సరదా ముచ్చట్లు.. ఇలా బాలయ్యను ఎప్పుడూ చూసుండం అనే రేంజ్‌లో బుల్లితెరపై బాలకృష్ణ తన సత్తా చాటుతున్నారు. అయితే టీవీలో బాలయ్యను చూడాలనే చాలా మంది ప్రేక్షకుల కోరిక కూడా త్వరలోనే తీరబోతోంది. అదెలాగంటారా.. మరో షోకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షో అంటే ఆషామాషీ షో కాదండోయ్.. ఆరేళ్లుగా ఆరు సీజన్లతో ప్రేక్షకులను నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేస్తోన్న బిగ్ బాస్ షో.

BigBoss Season 7
BigBoss Season 7

బిగ్ బాస్ షోకు బాలయ్య బాబు పర్ఫెక్ట్ హోస్టు అని చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే సీజన్ -1 లో జూనియర్ ఎన్టీఆర్, సీజన్-2లో నాని, ఇక సీజన్ 3 నుంచి నాగార్జున కంటిన్యూ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సీజన్-6 అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సీజన్‌పై నాగార్జున కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే నెక్స్ట్ సీజన్‌కు నాగ్ నో చెప్పారట. మరి కొత్త సీజన్‌కు హోస్టుగా ఎవరిని తీసుకొద్దామా అని తలలు పట్టుకుంటున్న బిగ్ బాస్ టీమ్‌కు అన్‌స్టాపబుల్ షోలో నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న బాలకృష్ణ కనిపించారట. అందుకే బిగ్‌బాస్‌ సీజన్7 కు బాలయ్యనే హోస్టుగా తీసుకురావాలనుకుంటున్నారట.

- Advertisement -
Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

బాలయ్య గానీ బిగ్ బాస్ హోస్ట్‌గా ఉంటే.. కంటెస్టెంట్లకు దబిడి దబిడేనని అభిమానులు అంటున్నారు. అయితే, ఇందులో నిజమేంటి అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. మరికొందరేమో కంటెస్టెంట్లతో బాలయ్య సరదాగా కలిసిపోతారని.. ఇక ఆటపట్టించడంతో బాలయ్యకు ఎవరూ సరిసాటి లేరని అంటున్నారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. బిగ్‌బాస్ వంటి రియాల్టీ షోకు బాలయ్య హోస్టుగా సెట్ కారని కొందరు నెటిజన్లు భావిస్తుంటే.. బోరింగ్ కంటెస్టుంట్లు వచ్చినా.. బాలయ్య సందడితో ఆ సీజన్ సరదాగా గడిచిపోతుందని మరికొందరు ఫీల్ అవుతున్నారు. మొత్తానికి చాలా మంది బాలయ్య బిగ్ బాస్ హోస్టుగా రావాలనే కోరుకుంటున్నారు. దీనిపై బాలయ్య కానీ.. బిగ్ బాస్ టీమ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు సంగతి తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Big Boss Season

సోషల్ మీడియాలో బిగ్‌బాస్ షోకు సంబంధించిన మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే బాలయ్య బిగ్‌బాస్ షోకు హోస్టుగా కన్ఫమ్ అయ్యారని.. ఆయన పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేశారని న్యూస్ వైరల్ అవుతోంది. ఈ షో కోసం బాలయ్య ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.

ఇదే విషయానికి సంబంధించి ‘ బిగ్ బాస్’ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు. ‘బిగ్ బాస్’ హోస్టుగా బాలయ్యను చూడాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయాన్ని వెల్లడించాడు. తనకు ఎప్పటి నుంచో ‘బిగ్ బాస్’ హోస్టుగా బాలయ్యను చూడాలని ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుత హీరోల్లో ఎవరు ‘బిగ్ బాస్’ హోస్టు అయితే బాగుంటుంది? అనే ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పాడు. ఆయన ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్తే కంటెస్టెంట్లు అంతా వణికిపోతారంటూ నవ్వాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here