Anikha Surendran: హీరో అజిత్ ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి సూపర్ హిట్ సినిమాలలో హీరో అజిత్ కూతురు పాత్రలో నటించిన అమ్మాయి అనిఖా సురేంద్రన్.. సౌత్ ఇండియా చైల్డ్ ఆర్టిస్టులో మంచి గుర్తింపును సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో అనిఖా సురేంద్రన్ కూడా ఒకరు.. రమ్యకృష్ణ క్వీన్ సిరీస్ లోను చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నారి.. ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైంది.
అనిఖా సురేంద్రన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. ఈ అమ్మడికి ఇన్స్టాగ్రామ్ లో 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. తన హట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తుంది.. ఈ ఫోటోలను చూసిన అమ్మడికి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అనీఖా కా బుట్ట బొమ్మ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతుంది.
బుట్ట బొమ్మ సినిమాతో తెలుగు పరిచయం అవుతుంది అనిఖా సురేంద్రన్.. మలయాళం లో సూపర్ హిట్ అయినా కప్పెలా సినిమాకు మీద ఈ సినిమా తెరకెక్కుతోంది. చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ దాస్ హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బుట్ట బొమ్మ సినిమాతో అర్జున్ దాస్ , అనిఖా సురేంద్రన్ ఇద్దరు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు..
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. బుట్ట బొమ్మ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అందుకున్న అనిఖా సురేంద్రన్ హీరోయిన్గా ఏ మేరకు నిలదొక్కుకుంటుందో చూడాలి..