Aishwarya lekshmi : మట్టికుస్తీ హీరోయిన్ ఆ విలన్ తో ప్రేమలో పడిందా..?



Aishwarya lekshmi : మాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాలా మంది హీరోయిన్లే వచ్చారు. అందులో కొంతమంది ఒకట్రెండు సినిమాలతో పెట్టాబేడ సర్దుకొని ఇంటిముఖం పట్టారు. మరికొందరేమో ఇక్కడే పాగా వేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. హైదరాబాద్ ను తమ రెండో ఇంటిగా మలుచుకున్నారు. నయనతార, నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్ వంటి కథానాయికలు మలయాళ కుట్టిగా ఇక్కడ అడుగుపెట్టి తెలుగు అమ్మాయిలుగా పేరు తెచ్చుకున్నారు. 

Aishwarya lekshmi
Aishwarya lekshmi

అలా మలయాళం నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మరో అందం ఐశ్వర్య లక్ష్మీ. ప్రజెంట్ ఈ బ్యూటీ దక్షిణాదిలో బిజీయెస్ట్‌ హీరోయిన్. ఓవైపు తెలుగు, మరోవైపు తమిళం, ఇంకోవైపు మలయాళం అని తేడా లేకుండా ప్రతీ భాషలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ మలయాళ బ్యూటీ.

aishwarya lekshmi and Arjun Das
aishwarya lekshmi and Arjun Das

గతేడాది అమ్ము, పొన్నియన్‌ సెల్వన్‌, మట్టి కుస్తీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. భర్త వేధింపులు తట్టుకునే భార్యగా ఆమె నటన అందరి మనసును తాకింది. ఇటీవల విడుదలైన ‘మట్టి కుస్తీ’లోనూ ఆమె కుస్తీ తెలిసిన గృహిణిగా అలరించారు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి.

ఐశ్వర్య సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలా తాజాగా తన సోషల్ మీడియా ఈ అమ్ము ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా.. ఈ మల్లు భామ ప్రేమలో పడిందట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన ప్రియుడిని పరిచయం చేసింది.

అయితే అతడెవరో కాదు. ఆ అబ్బాయి కూడా నటుడే. మాస్టర్‌, విక్రమ్ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్‌దాస్‌తో ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్‌దాస్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ లవ్‌ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్‌పై హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ సో హ్యాపీ అంటూ కామెంట్ చేసింది.

అయితే ఆ మధ్య ఐశ్వర్య ఓ ఇంటర్వూలో పెళ్లి ప్రశ్నలపై స్పందించి, తనకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని స్పష్టం చేసింది. అయితే అలా చెప్పిన కొన్ని రోజులకే ప్రేమను వ్యక్తపరచడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ పోస్ట్‌పై స్పందిస్తూ కొత్త సినిమా ప్రమోషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అర్జున్‌ దాస్‌ బుట్టబొమ్మ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మలయాళంలో సూపర్‌ హిట్టయిన కప్పెలా సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైనమెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అనీకా సురేందర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Aishwarya Lekshmi (@aishu__) • Instagram photos and videos