Anasuya Bharadwaj : ఈటీవీలో ప్రతి గురు-శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటే ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. ఈ షో వల్ల చాలా మంది కమెడియన్లు, యాంకర్లు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. సినిమాల్లో అవకాశాలు కూడా సంపాదించుకున్నారు. కొందరైతే హీరోలుగా మారి సినిమాలు కూడా తీశారు. అంతే కాకుండా మంచి హోదా తెచ్చుకున్నారు.
ఈ షో వల్ల.. ఇతర ఈవెంట్స్ లో అవకాశాలు కూడా వచ్చి కమెడియన్లు డబ్బులు పోగేసుకుంటున్నారు. కొందరు ఇళ్లు కొనుక్కుంటుంటే.. మరి కొందరు కార్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది సినిమాల్లో అవకాశాలు వచ్చి బిజీ బిజీ ఆర్టిస్టులుగా మారారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ను వీడారు. వారిలో ఒకరు జబర్దస్త్ యాంకర్ అనసూయ.
చాలా మంది జబర్దస్త్ చూడటానికి కారణం యాంకర్ అనసూయే అని చెబుతుంటారు. ఈ బ్యూటీ ఎంట్రీ సాంగ్ తోనే ఆ షో స్టార్ట్ అవుతుంది కూడా. ఆ ఎంట్రీ సాంగ్ లో ఈ బ్యూటీ హొయలు పలుకుతూ చేసే డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక ఈ భామ ఈ కార్యక్రమం కోసం ధరించే ఔట్ ఫిట్స్ చూసి చాలా మంది ఫిదా అయ్యారు కూడా. జబర్దస్త్ షో వల్ల అనసూయకు మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో వరుసగా సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.
ఈ మధ్యే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్నంత వరకు ఆ షో గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయని అనసూయ బయటకు వచ్చాక తన బాడీ గురించి చాలాసార్లు స్కిట్స్ లో అవహేళన చేశారని చెప్పింది.
అయితే ఇప్పుడు తాజాగా అనసూయ మరో కొత్త పాట పాడుతోంది. తాను జబర్దస్త్ వీడటానికి ఇన్నాళ్లూ ఏవేవో కారణాలు చెప్పిన ఈ భామ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఇద్దరి వల్లే షో మానేశానని చెబుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు ఆమె కొడుకులేనట.
అనసూయ తన పిల్లలతో గడపడానికి సమయం దొరకడం లేదనే ఉద్దేశంతోనే జబర్దస్త్ మానేశానని చెప్పుకొచ్చింది. ఓ వైపు సినిమాల షూటింగ్స్.. మరోవైపు జబర్దస్త్.. ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని.. అందుకే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశానని చెప్పింది. అయితే ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ తనకు చాలా మంచి కెరీర్ ఇచ్చిందని.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అవడం వల్ల జబర్దస్త్ చేయడం కుదరకపోవడం కాస్త బాధగానే ఉందని అంటోంది.
మొత్తానికి అప్పుడేమో బాడీ షేమింగ్ అంటూ హాట్ కామెంట్స్ చేసి.. ఇప్పుడు పిల్లల కోసమే జబర్దస్త్ వదిలేశానని అనసూయ మాట మార్చడం వెనక ఉన్న మర్మమేంటోనని నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అనసూయ కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యింది. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అనసూయ 16 ఏళ్లకే డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అనసూయ 16 ఏళ్లకే ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది.