Anchor Anasuya : ఓరి ద్యావుడా..అనసూయ కూడా ఆ వ్యాధితో బాధపడుతుందా?



Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఈ వయస్సులో కూడా అనసూయ ఎంత అందంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.ఎప్పుడైతే తను జబర్దస్త్ లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి తన లైఫే మారిపోయింది.తన కెరీర్ ఒక్కసారిగా పైకి ఎగబాకింది. ఒక యాంకర్ స్థానం నుంచి తను ఏకంగా హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. తనను ఎవ్వరూ ఆపలేకపోయారు. ఒక్కసారిగా జనాల్లో తనకు క్రేజ్ వచ్చేసింది. అనసూయ అంటే చాలు పిచ్చెక్కిపోయేలా చేసింది. తన అందచందాలతో కవ్వించి కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది యాంకర్ అనసూయ.

Anchor Anasuya
Anchor Anasuya

మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ యాంకర్ అనసూయ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు షోలు, ఇంకోవైపు సోషల్ మీడియా ఎక్కడ చూసినా అనసూయ గురించే చర్చ. మీడియా అయితే అనసూయ గురించి మాట్లాడని రోజు ఉండదు. అయితే.. తాజాగా అనసూయ నెటిజన్స్ గురించి ప్రత్యేకంగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది..అసలు అనసూయ ఏం పెట్టింది అంటూ దాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Anasuya
Anasuya

ఆ వీడియోలో అను మాట్లాడుతూ..నేను ఒక డిజార్డర్ తో బాధపడుతున్నా. అది ఏంటంటే.. నా గురించి నెగెటివ్ గా మాట్లాడే వారిని నేను అస్సలు లెక్క చేయను. వాళ్ల గురించి పట్టించుకోకపోవడమే నా డిజార్డర్ అంటూ సింపుల్ గా తనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్లపై ఉక్కుపాదం మోపింది అనసూయ. సాధారణంగా అనసూయను ట్రోల్ చేసేవాళ్లకు ఆ వీడియోను అంకితం చేసినట్టుగా ఉంది. కాకపోతే.. ఆ వీడియోలో ఉన్నది తన వాయిస్ కాదు. డబ్ ష్మాష్ చేసి ఆ వ్యాఖ్యలను చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఆ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది..