Mrunal Thakur : ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా.. మృణాల్ ఠాకూర్ ని చూస్తే ఈ పాట పాడకుండా ఉండలేం అనిపిస్తోంది కదూ. సీతారామం సినిమాలో సీతగా ఈ భామ తెలుగు తెరపై తన ముద్ర వేసింది. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఇంకా ప్రేక్షకుల మదిలో నుంచి సీత తలపు పోవడం లేదు.
అంతగా సీత.. అదేనండి మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే ఈ బ్యూటీ నుంచి ఇంకో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని టాలీవుడ్ ఎదురు చూస్తోంది. దాదాపు సీత రెండో సినిమా ఖరారైనట్లైనని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
మృణాల్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది మృణాల్ ఠాకూర్. తాజాగా మృణాల్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ కలర్ గౌనులో మృణాల్ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ముద్దు ముద్దు ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులను అలరిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా క్యూట్ గా ఉంది మా సీత అంటూ కామెంట్లు పెడుతున్నారు.