Re Release ట్రెండ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇవే!

- Advertisement -

Re Release ఈ మధ్యలో కాలం లో స్టార్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ మొన్నటి ఆరెంజ్ వరకు కొనసాగింది, కొనసాగుతూనే ఉంది.ఏప్రిల్ 8 వ తారీఖున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘దేశముదురు’ సినిమాని ఏప్రిల్ 6 వ తేదీన రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈ సినిమా రీ రిలీజ్ మూవీస్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఇప్పటి వరకు టాప్ 5 గా నిల్చిన రీ రిలీజ్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాము.

1 ) ఖుషి :

Re Release
Re Release

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని గత ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ చేసారు.ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఫుల్ రన్ లో 7 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితుల సమాచారం.ఇదే ఇప్పటి వరకు రీ రిలీజైన సినిమాలలో ఆల్ టైం టాప్ 1.

- Advertisement -

2)జల్సా :

jalsa

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన ఈ సినిమా ని గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసారు.కేవలం ఒక్క రోజు మాత్రమే ప్రదర్శింపబడ్డ ఈ చిత్రానికి దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇప్పటి వరకు ఈ చిత్రం రికార్డ్స్ ని కూడా ఎవ్వరూ అందుకోలేకపోయారు.

3) ఆరెంజ్:

orange

మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విడుదలైన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.ఆ చిత్ర నిర్మాత నాగబాబు ఈ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు.అలాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.సుమారుగా వారం రోజుల పాటు ప్రదర్శింపబడిన ఈ చిత్రానికి ఫైనల్ రన్ లో మూడు కోట్ల పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

4) ఒక్కడు :

okkadu

మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పి ఆయనని స్టార్ హీరో గా నిల్చోబెట్టిన ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు ఈ చిత్రాన్ని 4K కి మార్చి జనవరి 7 వ తారీఖున గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రాకపోయినప్పటికీ ఫుల్ రన్ లో రెండు కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి టాప్ 4 స్థానం లో నిల్చింది.

5) పోకిరి :

pokiri

తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్ర లో ఈ సినిమాకి కొన్ని పేజీలు ఉంటాయి.ఆరోజుల్లోనే సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమాని , గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసారు.వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమా తోనే రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో జోరుగా ప్రారంభమైంది.కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రదర్శింపబడ్డ ఈ చిత్రం దాదాపుగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

ఇప్పుడు జల్సా మరియు ఖుషి రికార్డ్స్ ని ఎవరు కొట్టబోతున్నారు అనేది పెద్ద టాస్క్ గా నిల్చింది.ఏప్రిల్ 6 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే దేశముదురు సినిమా కొడుతుందా, లేదా మే నెలలో విడుదల అవ్వబొయ్యే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కొడుతుందా అనే దాని పై సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here