JR NTR : ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళడం లేదా..? అసలేం జరుగుతోంది??

- Advertisement -

JR NTR : RRR మూవీ కి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం, ప్రతిష్టాత్మక అవార్డ్స్ రావడం గత కొంత కాలం నుండి జరుగుతూనే ఉంది.’గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ మరియు ‘లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్’ అవార్డ్స్ ని గెలుచుకున్న ఈ చిత్రం, రీసెంట్ గా HCA అవార్డ్స్ లో కూడా సత్తా చాటింది.ఈ HCA అవార్డ్స్ లో #RRR చిత్రం ఏకంగా 5 క్యాటగిరీలలో అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.

JR NTR
JR NTR

ఈ ఈవెంట్ రామ్ చరణ్ , కీరవాణి , కార్తికేయ మరియు రాజమౌళి హాజరు కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మిస్ అయ్యాడు.అంత పెద్ద అంతర్జాతీయ వేదిక పై తమ అభిమాన హీరోని చూసుకునే అరుదైన అదృష్టాన్ని కోల్పోయినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం, రీసెంట్ గానే ఆయన సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడమే అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

JR NTR ram charan

నందమూరి కుటుంబం మొత్తం విషాదం లో మునిగిపోయిన ఈ సందర్భం లో అవార్డ్స్ ఫంక్షన్ లో సంతోషం గా ఉండలేనని ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి దూరం గా ఉన్నట్టు సమాచారం.ఆయన తీరు చూస్తూ ఉంటే కనీసం ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి అయినా వస్తాడా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు.ఆస్కార్ అవార్డ్స్ కి ఆహ్వానం దక్కడమే ఒక అదృష్టం లాంటిది.అలాంటిది #RRR అక్కడ ఏకంగా నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది.టీం మొత్తం హాజరవుతుంది.

- Advertisement -
NTR For Oscars

ఒస్కార్స్ వేదిక పై ఎన్టీఆర్ – రామ్ చరణ్ ‘నాటు నాటు‘ పాటకి స్టెప్పులు వేస్తారని కూడా ఒక న్యూస్ వచ్చింది.కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న మూడ్ ని చూస్తూ ఉంటే ఆస్కార్ అవార్డ్స్ కి కూడా వచ్చేలా లేడు అనిపిస్తుంది. జీవితం లో అరుదుగా వచ్చే ఇలాంటి గౌరవం దక్కించుకోకపోతే ఏ అభిమాని కి అయినా చాలా బాధగా ఉంటుంది, మరి ఎన్టీఆర్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని వస్తాడా.. లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మార్చి 12 వ తారీఖున లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ జరగబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here