Pushpa 2 : ‘పుష్పరాజ్’ వచ్చేస్తున్నాడు.. అసలు తగ్గేదే లే..

- Advertisement -

Pushpa 2 : అల్లు అర్జున్ (allu arjun) అభిమానులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా పుష్ప2. ఈ సినిమా నుంచి ఓ కీలక అప్డేట్ రేపు ఉదయం రానుంది. ఈ మేరకు మైత్రి మూవీస్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ అప్డేట్ తో బన్నీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ‘పుష్ప’తో పోలిస్తే ‘పుష్ప2’లో అల్లు అర్జున్ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంది. ఈ మధ్య ఆయన లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు. అది ఈ సినిమా కోసమే అని టాక్. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా… ఒక్క రోజు ముందు (ఏప్రిల్ 7న) ‘పుష్ప 2’ ( pushpa2 ) లో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. బర్త్ డే రోజు గ్లింప్స్ రిలీజ్ చేస్తారట.

pushpa 2
Pushpa 2

ఇక ‘పుష్ప’ సినిమా దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక్కడ కోట్లు వసూళ్లు చేయడమే కాకుండా ఇతర దేశాల్లోనూ కాసుల వర్షం కురిపించింది. మొదటి భాగం విజయం సాధించడంతో రెండో భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెంచుతోంది చిత్ర యూనిట్. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ ‘పుష్ప’ తగ్గేదేలే అంటే.. ‘పుష్ప2’ అసలు తగ్గేదేలే అంటూ మరింత జోష్ నింపారు. బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోన్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు ‘పుష్ప 2’లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Allu Arjun

ఇప్పటికే ‘పుష్ప2’ చిత్రీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. కొన్ని రోజులు హైదరాబాదులో, విశాఖలో కీలక సన్నివేశాలు షూటింగ్ చేశారు. ఇటీవలే ఈ షూటింగ్ లో రష్మిక సైతం పాల్గొంది. మరి అల్లు అర్జున్ పుట్టినరోజు సంద్భంగా విడుదల చేయనున్న వీడియోలో బన్నీ ఎలా ఉంటాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here