సన్నీ ‘అన్ స్టాపబుల్’ మూవీ రివ్యూ.. జబర్దస్త్ స్కిట్స్ ఎంతో బెటర్!

- Advertisement -

రేడియో జాకీ గా కెరీర్ ని ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొని, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరై , బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ ని గెలుచుకున్నాడు సన్నీ. బిగ్ బాస్ హౌస్ నుండి ఈయనతో పాటుగా బయటకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయి లో ఉన్నారో చెప్పలేము కానీ, సన్నీ మాత్రం చాలా సినిమాల్లో హీరోగా బుక్ అయిపోయాడు. లేటెస్ట్ గా ఆయన హీరో గా నటించిన ‘అన్ స్టాపబుల్’ అనే సినిమా నేడే విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్ తో మంచి అంచనాలను రేపిన ఈ సినిమా, విడుదల తర్వాత ఆడియన్స్ అంచనాలను అందుకుందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

అన్ స్టాపబుల్' మూవీ రివ్యూ
అన్ స్టాపబుల్’ మూవీ రివ్యూ

కథ :

- Advertisement -

కోహినూర్ కళ్యాణ్ (సన్నీ) మరియు జిలాని రాందాస్ (సప్తగిరి) చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. పొట్ట కూటి కోసం వీళ్లిద్దరు యూట్యూబ్ ని నమ్ముకొని సినిమాలకు మరియు వెబ్ సిరీస్ లకు రివ్యూస్ చెప్తూ, దాని ద్వారా వచ్చిన డబ్బులతో కాలం గడుపుతుంటారు. అయితే వీళ్లిద్దరికీ కెరీర్ లో శాశ్వతంగా స్థిరపడిపోవాలని కోరిక పుడుతుంది. మొదటి నుండి క్రికెట్ బెట్టింగ్స్ ఆడే అలవాటు ఉన్న ఈ ఇద్దరు, IPL బెట్టింగ్స్ వెయ్యడం కోసం పది లక్షల రూపాయిలు అప్పు చేసి మరీ పందెం కాస్తారు. ఆ పది లక్షల రూపాయిలు బెట్టింగ్ లో పోతాయి. దీంతో అప్పు ఇచ్చినవాళ్ల నుండి కళ్యాణ్ మరియు జిలాని కి ఒత్తిడి పెరిగిపోతుంది.

ఎలా అయినా అప్పు కట్టి ఈ టార్చర్ నుండి బయటపడాలి అనే ఉద్దేశ్యం తో దుబాయి లో స్థిరపడిన తమ స్నేహితుడు హానీ భాయ్(షకలక శంకర్) ని 20 లక్షల రూపాయిలు సహాయం అడుగుతారు. అడగగానే హానీ భాయ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపుతాడు. కానీ అది కళ్యాణ్ అకౌంట్ లో కాకుండా జ్ఞాన్ వేల్ రాజా (పోసాని కృష్ణ మురళి) అకౌంట్ లో పడుతుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు జ్ఞాన్ వేల్ రాజా నుండి డబ్బులు ఎలా తిరిగి తీసుకున్నారు, ఈ గ్యాప్ లో జరిగిన పరిణామాలే ఈ చిత్ర కథ.

విశ్లేషణ :

కథ వినగానే చాలా కొత్తగా అనిపించింది కదూ, ఈ పాయింట్ నుండి ఎంతో హాస్యం మరియు సెంటిమెంట్ పుట్టించొచ్చు, సరైన టేకింగ్ తో ఈ సినిమాని తీస్తే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆ నమ్మకం తోనే సన్నీ ఈ కథ చెయ్యడానికి ఒప్పుకొని ఉండొచ్చు. కానీ కొత్త తరహా కాన్సెప్ట్ ని ఎంత నాసిరకంగా తీసి , చెత్తగా ఉందని ఆడియన్స్ చేత అనిపించుకోవాలో, అంత చెత్త టేకింగ్ తో ఈ సినిమాని రొటీన్ సినిమాగా తీర్చి దిద్దాడు డైమండ్ రత్నం బాబు.

ఈయన గత చిత్రం మోహన్ బాబు తో తీసిన ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ సినిమా చూసిన తర్వాతే ఇతని టేకింగ్ ఎంత నాసిరకం గా ఉంటుందో అర్థం అయ్యింది. ఈ సినిమాతో ఆ నాసిరకం టేకింగ్ పీక్ కి వెళ్ళింది.ఈమధ్య అడల్ట్ కామెడీ కి యూత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఈ సినిమా మొత్తం బూతు కామెడీ తో నింపేసాడు డైరెక్టర్, కానీ అవి క్లిక్ అయ్యినప్పుడు బాగుంటుంది కానీ, క్లిక్ కానప్పుడు మాత్రం చాలా చిరాకు వేస్తాది. ఈ సినిమా విషయం లో కూడా అదే జరిగింది. మంచి కామెడీ కి స్కోప్ ఉన్నప్పటికీ కూడా, డైరెక్టర్ దానిని సరిగా వాడుకోలేదు. హీరో హీరోయిన్ కి మధ్య మంచి లవ్ ట్రాక్ ని ఫీల్ గుడ్ తో ముగించే స్కోప్ కూడా ఉంది, దానిని కూడా వాడుకోలేదు. అన్నిటికీ మించి సన్నీ మరియు సప్తగిరి మధ్య బోలెడంత కామెడీ ని పండించే అవకాశం ఉంది. దానిని కూడా వాడుకోలేదు ఈ డైరెక్టర్. అలా ఒక మంచి కథా బలం ఉన్న సినిమాని నాసిరకం టేకింగ్ తో జబర్దస్త్ షో ని వెండితెర మీద చూపించినంత పని చేసాడు డైరెక్టర్ రత్నం బాబు.

చివరి మాట:

జబర్దస్త్ కామెడీ షో రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ సినిమా ఒకసారి నచ్చొచ్చు, టైం పాస్ కోసం కావాలంటే థియేటర్స్ కి వెళ్ళండి.

నటీనటులు : వీజీ సన్నీ, సప్తగిరి, షకలక శంకర్, శివాజీ రాజా , నక్షత్ర, అక్సా ఖాన్, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి తదితరులు.

రచన, దర్శకత్వం : డైమండ్ రత్నం బాబు
సంగీతం : భీమ్స్
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్
నిర్మాత : రజిత్ రావు

రేటింగ్ : 2.5/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here