4 రోజుల్లో 300 కోట్లు..1000 కోట్ల వైపు అడుగులు వేస్తున్న రజినీకాంత్ ‘జైలర్’

- Advertisement -

గత కొంతకాలం గా సూపర్ స్టార్ రజినీకాంత్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం వల్ల కొంతమంది ఆయన స్టామినా మీద ఎన్నో కామెంట్స్ చేసారు. రజినీకాంత్ కి వయస్సు అయిపోయింది, ఇక ఆయన సినిమాలు ఎవ్వరూ చూడరు అనేవాళ్ళు. కానీ సూపర్ స్టార్ ఇమేజి ఉన్న ఒక స్టార్ హీరో స్టామినా ఎప్పటికీ మసకబారిపోదు అని రీసెంట్ గా విడుదలైన ‘జైలర్’ సినిమా వసూళ్లను చూస్తే అర్థం అవుతుంది.

జైలర్
జైలర్

మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మూడు రోజుల్లో రాబట్టిన వసూళ్లు, నేటి తరం స్టార్ హీరోలకు లైఫ్ టైం లో కూడా రాలేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే చాలా ప్రాంతాల్లో షారుక్ ఖాన్ పఠాన్ రికార్డ్స్ ని అవలీల గా దాటేసింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం 4 రోజులకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ మరియు 149 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకి 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. అంటే షేర్ విలువ దాదాపుగా 19 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు.

- Advertisement -

మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకున్న దిల్ రాజు, ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొడుతాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక తమిళనాడు లో 82 కోట్ల రూపాయిలు , కర్ణాటక లో 32 కోట్ల రూపాయిలు, కేరళ లో 23 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 125 కోట్ల రూపాయిలు, ఇలా మొత్తం మీద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఇదే జోరుని కొనసాగిస్తే వెయ్యి కోట్ల మార్కుని కూడా అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here