ఇండస్ట్రీలో ఆయనొక్కడే రియల్ హీరో.. మిగతా వాళ్లంతా డమ్మీలే

- Advertisement -

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా నోటి దురుసుతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఉన్న ఒక్కొక్కరిపై కామెంట్లు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నిత్యం ఏదో ఒక పోస్టుతో ఏదో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా ఫ్యామిలీ పైన నిత్యం పలు రకాల ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. శ్రీరెడ్డి ఇటీవల ఏపీ మంత్రి, సినీ నటి రోజా పైన చేసిన వ్యాఖ్యల వల్ల మంత్రి రోజా అభిమానులు ఆమె తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం మరోమారు మెగా హీరోలను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి.

sri reddy
sri reddy

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పైన ప్రశంశలు జల్లు కురిపించింది. మెగా ఫ్యామిలీలో అంత డమ్మీ గాళ్లే ఉన్నారంటూ బాంబు పేల్చింది. వారిలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారని అతడిని ఆకాశానికి ఎత్తేసింది. అల్లు అర్జున్ కు ఫుల్ సపోర్టు ఇస్తానని తెలిపింది. దాంతో పాటు మిగతా మెగా హీరోలకు అంత సీన్ లేదంటూ వారంతా బిల్డప్ స్టార్లే అంటూ ఎత్తి పొడిచింది. ఇతర భాషలలో హిట్ సాధించిన సినిమాలు ఇక్కడకు తెచ్చి చాలా ఓవర్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. అల్లు అర్జున్ మాత్రమే తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా చేయలేదని తెలిపింది. అందుకే అతను ఒక్కడే టాలెంట్ కలిగి ఉన్న హీరో మిగతా వారంతా రీమేక్ స్టార్లే అంటూ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్లు విన్న మెగా అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. చాలామంది శ్రీరెడ్డి కామెంట్లు కరక్టే అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here