Rajasekhar: నడిరోడ్డు మీద ఆ నటుడిని బట్టలు ఊడదీసి కొట్టిన హీరో రాజశేఖర్.. మరీ ఇంత దారుణమా!

- Advertisement -

Rajasekhar ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి కెరీర్ ప్రారంభంలోనే వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు అడపాదడపా అప్పుడప్పుడు హీరో రోల్స్ చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్న రాజశేఖర్ కి ‘అంకుశం’ అనే సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Rajasekhar
Rajasekhar

రాజశేఖర్ పేరు ఎత్తితే మన అందరికీ గుర్తుకు వచ్చేది ‘అంకుశం’ చిత్రమే, చాలా మంది రాజశేఖర్ ని అంకుశం రాజశేఖర్ అని ఇప్పటికీ పిలుస్తుంటారు. ఈ సినిమాతోనే ఆయనకీ స్టార్ ఇమేజి, అలాగే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి వచ్చింది. పోలీస్ క్యారెక్టర్స్ కి రోల్ మోడల్ గా నిల్చిన ఈ చిత్రం లో విలన్ గా రామిరెడ్డి నటించిన సంగతి అందరికీ తెలిసిందే. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రామిరెడ్డి విలనిజం ఒక రేంజ్ లో ఉంటుంది, ఆయన పాత్రని చూసిన ఎవరికైనా కొట్టి చంపేయాలి అనేంత కోపం వస్తుంది, అలా కోపం వచ్చిన సమయం లోనే హీరో రాజశేఖర్ ఆ సినిమాలో రామిరెడ్డి ని నడిరోడ్డు మీద కుక్కని కొట్టినట్టు కొడుతూ పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొని వెళ్తాడు. ఈ సన్నివేశం అప్పట్లో ఒక సెన్సేషన్, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సన్నివేశం వల్లే ఆ చిత్రం మరో లెవెల్ కి వెళ్లి అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అయితే ఈ సన్నివేశం ఆ రేంజ్ లో రావడానికి డైరెక్టర్ కోడి రామకృష్ణ చాలా కసరత్తు చేసాడు. ఎన్నో టేకులు తీసుకున్నాడు, కానీ ఆయన కోరుకున్న ఎమోషన్ మాత్రం పుట్టడం లేదు.

- Advertisement -

దీంతో రాజశేఖర్ మరియు రామిరెడ్డి ని దగ్గరకి పిలిచి, ఈ సన్నివేశం లో కావాల్సిన ఎమోషన్ పుట్టడం లేదు, నువ్వు రామిరెడ్డి ని నిజంగానే కొట్టుకుంటూ తీసుకెళ్ళు అంటాడు. అప్పుడు రాజశేఖర్ దానికి ససేమీరా ఒప్పుకోలేదు, కానీ రామిరెడ్డి ఏమి పర్వాలేదు సార్, నేనేమి అనుకోను, సన్నివేశం పండాలంటే నేను ఏమి చేయడానికైనా రెడీ ,మీరు కొట్టండి ఏమి కాదు అని చెప్పి , ఆయనని బలవంతంగా ఒప్పించి ఈ సన్నివేశం చిత్రీకరించారట. ఫైనల్ గా మనం చూసిన ఆ సన్నివేశం లో రాజశేఖర్ రామిరెడ్డి ని నిజంగానే నడిరోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాడు అన్నమాట. పాపం రామిరెడ్డి ఈ సన్నివేశం జరిగిన తర్వాత దెబ్బలు బాగా తగిలాయి, చాలా రోజులు వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర్ స్వయంగా డాక్టర్ కాబట్టి, ఆయనే రామిరెడ్డి కి చికిత్స చేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here