Shivathmika : కష్టాల్లో రాజశేఖర్ కూతురు.. ఏ దర్శకుడు ఆదుకుంటాడో పాపం..

- Advertisement -

Shivathmika : శివాత్మిక పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలోని గొప్ప సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి సినీ రంగ ప్రవేశం చేసింది. ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాలో ఆమెకు మంచి మార్కులే పడినా చిత్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తరవాత ఆమె ఒక తమిళ సినిమాలో నటించారు. అది కూడా మెప్పించలేకపోయింది. మళ్లీ ఇప్పటి వరకు అయితే శివాత్మికాకు తనను తాను నిరూపించుకునే సరైన అవకాశం పూర్తి స్థాయిలో దక్కలేదు.

Shivathmika
Shivathmika

స్టార్ కుటుంబంలో నుంచి వచ్చిన శివాత్మికకు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో పడినప్పటికి శివాత్మిక ఫేట్ మారలేదు. పెద్ద హీరోయిన్‌ అవుతుందనుకుంటే రంగమార్తాండలో నెగిటివ్ షేడ్ ఉన్న కూతురు పాత్రతో అసలు ఊహించిన దాంట్లో సగం పేరు కూడా రాలేదు. ప్రస్తుతానికి ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. శివాత్మిక రాజశేఖర్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. వచ్చిన అర, కొర సినిమాలు అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోవడంతో అమ్మడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Actress Shivathmika
Actress Shivathmika

అందుకే సోషల్ మీడియా ద్వారా అభిమానులను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉంది. రోజూ రకరకాల ఫొటోలతో కనువిందు చేస్తోంది. ఇవి చూసైనా ఏ దర్శకుడైనా అవకాశం ఇవ్వకపోతాడా అని అనుకుంటుంది ఈ అమ్మడు. శివాత్మిక ప్లవర్ డిజైన్డ్ రెడ్ శారీ విత్ స్లీవ్‌ లెస్ బ్లౌజ్‌లో ఇచ్చిన ఫోటోలకు నెటిజన్లు ఆమెపై ప్రేమవర్షం కురిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో మంచి కథ ఉంది..శివాత్మిక లీడ్ రోల్‌లో నటిస్తావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదైమైనా శివాత్మిక టాలెంట్ ఏంటో రంగమార్తండలో నిరూపించింది. త్వరలోనే మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నారు కొందరు సినీ ప్రియులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here