ఇండస్ట్రీని గబ్బుపట్టిస్తున్న మంచు విష్ణు, కరాటే కల్యాణి గోల

- Advertisement -

తెలుగు సినీ ప్రేక్షకులకు కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లో కామెడీ రోల్స్ చేయడంతో పాటు కొన్ని సీరియల్స్ లో విలన్ రోల్ లో కూడా కనిపించి మెప్పించిన విషయం తెల్సిందే. నటిగా ఆమెను ఎవరు కూడా తప్పుబట్టరు. కానీ ఆమె చేసే సినిమేతర కార్యక్రమాల వల్ల వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ మధ్య ఒక వ్యక్తిని కొట్టి వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. తాజాగా ఎన్టీఆర్ వందవ జయంతి సందర్భంగా ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో ఆ విగ్రహ ఆవిష్కరణ అడ్డుకుంటామంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే.

కరాటే కల్యాణి
కరాటే కల్యాణి

ఈనెల 28న తెలుగువారి ఆరాధ్య దైవం నటరత్న ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో లక్కారం బండపై 54 అడుగుల శ్రీకృష్ణ అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణుడు అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడంపై కరాటే కళ్యాణి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు చెబుతూ ఉద్యమానికి దిగింది. ఈ కార్యక్రమాన్ని కరాటే కళ్యాణి యాదవ సంఘం పేరుతో అడ్డుకుంటానంటూ ప్రకటించింది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకురాలిని అంటూ చెప్పుకునే కరాటే కళ్యాణి యొక్క వ్యాఖ్యలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Manchu Vishnu karate kalyani

అయితే కరాటే కళ్యాణి వాఖ్యలపై మా అసోసియేషన్ స్పందించినట్టు తెలుస్తోంది. మా అసోసియేషన్ నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. స్వయంగా మంచు విష్ణువే ఆమెకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఆ కాల్‌లో మీ స్టాండ్ మార్చుకోవాలని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కరాటే కళ్యాణి స్పందించింది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు అడ్డు తగలవద్దని ఆయన పేర్కొన్నారు. ఈ విష‌యంపై త‌న వైఖ‌రి మ‌ర‌ద‌ని ఆమె చెప్పుకోచ్చింది. ఇప్పుడు ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎక్క‌డి దారి తీస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here