Hyper Aadi : జనసైనికులకు హైపర్ ఆది ఎమోషనల్ మెసేజ్.. పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించావంటూ నెటిజన్స్ కామెంట్స్

- Advertisement -

Hyper Aadi : టాలీవుడ్ కమెడియన్, నటుడు హైపర్ ఆది మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్​పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఆది ఎప్పుడూ సినిమాలు, రాజకీయాల విషయంలో పవన్ కల్యాణ్​కు మద్దతు ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తన అభిమానాన్ని సందర్భవం వచ్చిన ప్రతిసారి చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జనసేనకు తక్కువ సీట్లు కేటాయించారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసైనికులకు హైపర్ ఆది ఓ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చాడు. సుదీర్ఘమైన ఓ వీడియోను పోస్టు చేసిన ఆది సీట్ల ప్రకటన తర్వాత జనసైనికుల ఆవేదన తట్టుకోలేక ఈ వీడియోను పంపిస్తున్నానని చెప్పాడు. ఈ వీడియోను జనసేన నేత నాగబాబు ‘ఎక్స్​’లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఇందులో ఏముందంటే?

hyper aadi
hyper aadi

“జనసైనికులు ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించాలి.​ తనను నమ్ముకున్న ప్రజలను, తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్​ది కాదు. పెట్టిన పార్టీకి సపోర్టు చేస్తున్న ప్రజలే ఇంతగా ఆలోచిస్తుంటే, అదే పార్టీని పెట్టిన పవన్ కల్యాణ్​ ఎంతగా ఆలోచించారో కదా. ఒక నిర్ణయం తీసుకోవడానికి తనలో తాను ఎంతగా మదన పడ్డారో ఒక్కసారి ఆలోచించాలి. ఇన్నేళ్లుగా ఎటువంటి అవినీతి చేయకుండా, తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప వ్యక్తి పవన్ కల్యాణ్​. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్లు జనసైనికులు కూడా మాట్లాడటం చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది.

2019 ఎన్నికలలో కనీసం పవన్ కల్యాణ్​ని కూడా గెలిపించుకోలేదని, ఇప్పుడు 24 సీట్లపై ప్రశ్నించే హక్కు జనసైనికులుగా మనకు ఉందా? మామూలుగా ఎవరైనా సరే చిన్న పరీక్ష ఫెయిల్​ అయితేనే చాలా రోజులు ఇంటి నుంచి బయటకిరారని, అలాంటిది పవన్ కల్యాణ్​ మాత్రం రెండు చోట్లా ఓడిపోయినా సరే సమస్య అనేసరికి రెండో రోజే బయటకు వచ్చి దానిని పరిష్కరించారు. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బులు సైతం తీసి కౌలు రైతుల సమస్యలను తీర్చిన పవన్ కల్యాణ్​ గురించి ఈ రోజు విమర్శలు చేస్తున్నారు.”అని హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు.

- Advertisement -
pawan kalyan
pawan kalyan

“రోజుకు రెండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్​గా తీసుకునే ఒక స్టార్ హీరో అయిన పవన్ కల్యాణ్​, డబ్బంతా ప్రజలకు పంచిపెట్టేసి అప్పులు తీసుకొని మరీ పార్టీని నడుపుతున్నారనే విషయం ఎంతమందికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు విమర్శలు చేస్తున్నారు. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తామో చెప్తున్నారు. కానీ పవన్ కల్యాణ్​ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన సొంత జేబు నుంచి నుంచి డబ్బులు తీసిమరీ సహాయం చేశారు.

అలాంటి వ్యక్తిని పట్టుకుని కులాన్ని తాకట్టు పెట్టాడు, ప్యాకేజీ తీసుకున్నాడు, పార్టీని తాకట్టుపెట్టాడు అంటూ ఈరోజు చాలామంది సింపుల్​గా అనేస్తున్నారు. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి పవన్ కల్యాణ్​ కాదు. ప్రజల పంచే ప్రేమకు మాత్రమే పవన్ కల్యాణ్​ బానిస. నాయకులు పంచే డబ్బులకు కాదు. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటమే నిజమైన అభిమానం. అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టి, లేనప్పుడు బై చెప్పడం కాదు. ఎవరో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాటిని చూసి మనమే మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు.” అంటూ హైపర్ ఆది జనసైనికులకు సూచించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here