Hyper Aadi : అమ్మాయిని ఏడిపించినందుకు ఒంగోలులో హైపర్ ఆదిని చితకబాదిన జనాలు!

- Advertisement -

Hyper Aadi : బుల్లితెర మీద జబర్దస్త్ అనే కామెడీ షో తో పరిచయమై తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తూ, అతి తక్కువ సమయం లోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కమెడియన్ హైపర్ ఆది. ఈ షో లో ఆయన కామెడీ టైమింగ్ ని నచ్చిన దర్శక నిర్మాతలు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రస్తుతం హైపర్ ఆది లేని సినిమా అంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఫుల్ బిజీ గా ఉండడం వల్ల ఆయన జబర్దస్త్ షో కి దూరం అయ్యాడు. కానీ ఇప్పటికీ ఆయన ఢీ , శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో కొనసాగుతూనే ఉన్నాడు. హైపర్ ఆది కారణంగానే ఆ రెండు షోస్ కి ఇప్పటికీ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే హైపర్ ఆది అమ్మాయిల మీద వేసే పంచులు బాగానే ఉంటాయి కానీ, కొంతమంది అమ్మాయిలు మాత్రం ఆ పంచులను తీసుకోలేకపోతున్నారు.

అయితే బయట కూడా ఆయన అలాగే అమ్మాయిల మీద జోక్స్ వేస్తూ ఉంటాడట. కాలేజీ లో చదివే రోజుల దగ్గర నుండి, సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేసే రోజుల్లో కూడా ఆయనకి ఈ అలవాటు ఉండేదట. అయితే ఒంగోలు లో కూడా ఇలాగే ఒక అమ్మాయి మీద కామెంట్ చేస్తే ఆ అమ్మాయి తరుపున మనుషులు హైపర్ ఆదిని చితకబాదినట్టు గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అయ్యింది.

- Advertisement -

దీని పై హైపర్ ఆది రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నేను అసలు నాతో స్నేహం గా ఉండే అమ్మాయిల మీద సరదాగా వాళ్ళు తీసుకునే రేంజ్ పంచులు మాత్రమే వేస్తాను. బయట అమ్మాయిలతో అసలు మాట్లాడను. అంతెందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ లో స్టేజి మీద స్కిట్స్ వేసేంత వరకే అమ్మాయిలతో మాట్లాడుతాను. క్రిందకి దిగిన తర్వాత నేనెవరో, వాళ్లెవరో’ అంటూ చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here