Tollywood Hit Pairs : మళ్లీ వస్తోన్న హిట్ పెయిర్స్.. 2023 లోనూ సక్సెస్ రిపీట్..!



Tollywood Hit Pairs : సినిమా ఇండస్ట్రీలో కాంబో అనే పదానికి వాల్యూ ఎక్కువ. డైరెక్టర్-హీరో కాంబో, హీరో-హీరోయిన్ కాంబో, డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబో, డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబో.. ఇలా రకరకాల కాంబోల గురించి మనం వింటూ ఉంటాం. చాలా మంది సినీ ప్రేక్షకులు.. డైరెక్టర్-హీరో, హీరో-హీరోయిన్ కాంబినేషన్ చూసుకుని సినిమాకు వెళ్తారు. ఫలానా హీరో – డైరెక్టర్ కలిస్తే బొమ్మ బ్లాక్​బస్టరే అని ఫిక్స్ అయి ఉంటారు. వారు కలిసి సినిమా చేస్తే తప్పక చూస్తారు. అలాగే తమ ఫేవరెట్ హీరో – హీరోయిన్ పెయిర్ సినిమా వస్తే ఇక ప్రేక్షకులకు పండగే.

Tollywood Hit Pairs
Tollywood Hit Pairs

హీరో – హీరోయిన్ పెయిర్ ఎంత బాగా ఉంటే.. ఆ సినిమాకు అంత క్రేజ్. అలా టాలీవుడ్​లో ఇప్పటికే చాలా జంటలున్నాయి. కానీ వారిలో కొంత మంది మాత్రమే హిట్ జోడీ అనిపించుకున్నారు. అందుకే అలాంటి జంటలను కలిపి మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని దర్శకనిర్మాతలు ఆశపడుతుంటారు. అలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని హిట్ జోడీలున్నాయి. మరికొన్ని సినిమా హిట్, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించే జోడీలున్నాయి. అలాంటి జోడీలు ఈ ఏడాది కూడా రిపీట్ అవుతున్నాయి. మళ్లీ ఈ జంటలు కలిసి బాక్సాఫీస్​ను షేక్ చేయడానికి వస్తున్నారు. మరి ఆ హిట్ జోడీలెవరో చూద్దామా..?

puja Hegde and Mahesh babu

మహేష్‌బాబు – పూజాహెగ్డే జోడీ ‘మహర్షి’తో తొలిసారి సందడి చేసింది. ప్రస్తుతం అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ ఆ ఇద్దరినీ కలిపి సినిమా చేస్తున్నారు. మహేష్‌ – త్రివిక్రమ్‌ఎలాగో, త్రివిక్రమ్‌ – పూజాహెగ్డే కలయిక కూడా అంతే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పూజాహెగ్డే నటించిన ‘అరవింద సమేత’,  ‘అల వైకుంఠపురములో’ విజయాలు అందుకున్నాయి. అందుకే మహేష్‌ – పూజాహెగ్డే – త్రివిక్రమ్‌ కలయిక ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణని సంతరించుకుంది. 

Ram Charan and kiar adwani

 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న మరో రిపీట్‌ జోడీ రామ్‌చరణ్‌ కియారా అడ్వాణీ. ఈ ఇద్దరూ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కలిసి నటిస్తున్నారు.

Allu Arjun and rashmika mandanna

పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. అల్లు అర్జున్‌రష్మిక.. జంట ‘పుష్ప’తో ప్రేక్షకలోకాన్ని ఊపేసింది. ఇప్పుడు కొనసాగింపుగా రూపొందుతున్న ‘పుష్ప2’ చిత్రంలోనూ ఈ జోడీ సందడి చేయనుంది.

Vijay devarakonda and samantha

విజయ్‌ దేవరకొండ – సమంత జోడీ ‘మహానటి’లో మంచి వినోదం పంచింది. ‘ఖుషి’ కోసం ఈ ఇద్దరూ మరోసారి కలిశారు.  ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఆ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Naga Chaitanya

నాగచైతన్య కృతిశెట్టి జంట ‘బంగార్రాజు’తో ఆకట్టుకుంది. చిన్న సోగ్గాడిగా నాగచైతన్య, సర్పంచి నాగలక్ష్మిగా కృతి శెట్టి సందడి చేశారు. ఆ ఇద్దరూ ఇప్పుడు ‘కస్టడీ’ కోసం జట్టు కట్టారు.

నాని కీర్తి సురేష్‌ జంటగా  ‘నేను లోకల్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ‘దసరా’ కోసం వీళ్లిద్దరూ మరోసారి ఆడిపాడుతున్నారు.

Tags: