RamCharan : రామ్‌చరణ్‌కు ఆ సినిమాలంటే బాగా ఇష్టమట

- Advertisement -

RamCharan : మెగాపవర్ స్టార్ రామచరణ్.. చిరుత సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి ఆ తర్వాత మగధీరతో తన సత్తా ఏంటో చూపించాడు. ఇక రంగంస్థలంలో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్‌ అయిపోయాడు.

RamCharan
RamCharan

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు. ఇక ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియానే కాదు.. వరల్డ్ వైడ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలోని విజువల్స్, ఫైట్స్, పాటలు, డ్యాన్స్.. ఇలా ప్రతీది తెలుగు ప్రేక్షకుల నుంచి అంతర్జాతీయ ఆడియెన్స్ వరకూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందుకే ఈ మూవీకి ఇండియాలోనే కాదు జపాన్, అమెరికా వంటి విదేశాల్లోనూ తెగ ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ కూడా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ కలెక్షన్స్ సాధించాయి.

RRR
RRR

ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా అందుకుంది. లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఆ వేడుకకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఎన్టీఆర్‌తో కలిసి హాజరైన చరణ్‌ అక్కడి విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సుమారు 30 ఏళ్ల నుంచి ఎన్టీఆర్‌ కుటుంబం, తమ కుటుంబం మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉందని ఈ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ చెప్పాడు. అంతే కాకుండా తనకి ఇష్టమైన సినిమాలేంటి.. ఇంకా ఇతర విషయాలను పంచుకున్నాడు. మరి ఆ ఇంటర్వ్యూలోని మరికొన్ని విశేషాలేంటో చూద్దామా..!

- Advertisement -

‘‘కొన్ని సినిమాల్లోని పాత్రలకు బాగా కష్టపడాల్సి వస్తుంది. నా కెరీర్‌లో సవాలుగా తీసుకుని చేసిన చిత్రం ‘రంగస్థలం’. అందులో నేను పల్లెటూరి వ్యక్తిగా, చెవిటివాడి పాత్రలో కనిపిస్తా. దాన్నుంచి నటుడిగా మంచి అనుభవాన్ని గడించా. ప్రేక్షకులు ఆ సినిమాపై విశేష ఆదరణ చూపించి, ఇండస్ట్రీ హిట్‌ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలోనూ ఛాలెంజ్‌ ఎదురైంది. దర్శకుడు రాజమౌళి నటుల హావభావాలపై ఎక్కువ ఫోకస్‌ చేస్తారు. ఆ ప్రక్రియను బాగా ఎంజాయ్‌ చేశా. ఈ చిత్రానికి జపాన్‌, అమెరికాలోనూ మంచి స్పందనరావడం చాలా ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా నేను డ్రామా, ఇంటెన్సివ్‌ సబ్జెక్ట్‌లను బాగా ఇష్టపడతా’’ అని చరణ్ చెప్పాడు.

‘‘హాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని వుడ్‌లు పోయి త్వరలోనే ‘గ్లోబల్‌’ సినిమా అనే పేరొస్తుందని ఆశిస్తున్నా. ‘టాప్‌గన్‌’ సిరీస్‌ చిత్రాలు నా ఫేవరెట్‌. ఇటీవల వచ్చిన ‘టాప్‌గన్‌: మావెరిక్‌’లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేశాయి. అలాంటి సినిమాలు నాకు స్ఫూర్తినిస్తుంటాయి. ప్రతి ఏడాదీ బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తా. 2022.. నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరంగా నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారంలో భాగంగా జపాన్‌ వెళ్లినప్పుడు నేను తండ్రిని కాబోతున్నాననే శుభవార్త తెలిసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాకు ఎన్నో జ్ఞాపకాలు అందించింది. నేను ఇలా మీ అందరితో మాట్లాడుతున్నానంటే ఏదో సాధించినట్టుగా ఉంది. ప్రస్తుత క్షణాల్ని బాగా ఆస్వాదిస్తున్నా’’ అని రామ్ చరణ్ అన్నాడు.

‘‘ఇండియాలో ఆన్‌స్క్రీన్‌ ఇమేజ్‌, ఆఫ్‌స్క్రీన్‌ ఇమేజ్‌.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. సినిమా విశేషాలు పంచుకునేందుకు కొన్నాళ్ల క్రితం సోషల్‌ మీడియాలో అడుగుపెట్టా. అయితే, దాని వినియోగంలో చురుగ్గా ఉండను. సామాజిక మాధ్యమాల్లో కనిపించే కామెంట్ల కంటే థియేటర్లలో ప్రేక్షకులు చేసే కామెంట్లనే పట్టించుకుంటా’’ అని చరణ్ చెప్పుకొచ్చాడు.

‘‘మా కుటుంబంలో ఏడుగురు నటులున్నాం. కజిన్స్‌తో ఇంట్లోనే పోటీ ఉంటుంది .. అలానే, సుమారు 30 ఏళ్ల నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో ఆరోగ్యకర పోటీ వాతావరణం ఉంది. తారక్‌ తాతగారు (నందమూరి తారకరామారావు), మా నాన్న (చిరంజీవి) మధ్య హెల్దీ కాంపిటిషన్‌ ఉండేది. అలాంటిది రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం మా ఇద్దరిని ఎంపిక చేశారు. తారక్‌తో కలిసి మరో సినిమా చేయాలనుంది. ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులకు సంతకం చేశా. 2023లో మూడు చిత్రాలు, 2024లో మూడు చిత్రాలు వస్తాయి’’ అని రామ్‌ చరణ్‌ చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here