Naga Chaitanya : శోభితతో నాగచైతన్య ఫొటో వైరల్.. వీళ్లద్దరి డేటింగ్ నిజమేనా..?నాగ చైతన్య-సమంత టాలీవుడ్​లో ఒకప్పుడు పవర్ కపుల్. కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లే చూసుకున్నారు. సామ్ వల్లే విడాకులు అయ్యాయని చాలా మంది సమంతపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ చేశారు. ఇద్దరం పరస్పర అవగాహనతోనే ఫ్రెండ్లీగానే విడిపోతున్నామని చై-సామ్​లు ప్రకటించారు. ఇప్పుడు Naga Chaitanya  మరో హీరోయిన్​కు దగ్గరయ్యాడని టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. Sobhita Dhulipala కు, చైతన్యకు మధ్య ఎఫైర్ నడుస్తోందని టాక్.

ఈ న్యూస్​పై ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా నాగచైతన్య, శోభిత కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే వీళ్లిద్దరు ఇప్పటి వరకు కలిసి నటించలేదు. మరి ఈ ఫొటో స్టోరీ ఏంటని నెటిజన్లు తెగ ఆలోచించేస్తున్నారు.

Naga Chaitanya / Sobhita Dhulipala
Naga Chaitanya / Sobhita Dhulipala

నిప్పులేనిదే పొగరాదంటారు పెద్దలు. వాస్తవం లేకుండా పుకార్లు వినిపించవనేది కూడా నిజం. వంద శాతం పుకార్లు నిజం కాకపోయినా కొన్ని ప్రచారాల్లో నిజం ఉంటుంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారన్న వార్త ఆ మధ్య సంచలనం రేపింది. “నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల సన్నిహితంగా ఉంటున్నారు. వారి మధ్య ఎఫైర్ నడుస్తుంది. వారిద్దరూ తరచుగా టూర్స్, వెకేషన్స్ కి వెళుతున్నారు. నాగ చైతన్య కొత్త ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడు. శోభితను నాగ చైతన్య వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు.” అంటూ మీడియాలో వార్తలొచ్చాయి.

ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. శోభిత కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అదంతా ట్రాష్ అంటూ కొట్టిపడేసింది. దీనిపై సమంత కూడా ఇన్​డైరెక్ట్​గా రియాక్ట్ అయింది. ‘ఒక అమ్మాయి మీద ప్రచారం జరిగితే నిజం. అదే అబ్బాయిపై పుకార్లు చెలరేగితే.. ఆ ప్రచారం వెనుక ఒక అమ్మాయి ఉందంటారా..?” అని సమంత ట్వీచ్ చేసింది.

తాజాగా శోభిత-నాగ చైతన్య కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటో నేపథ్యం చూస్తే ఒక విదేశీ టూర్​లో ఇద్దరూ ఫొటోకి ఫోజు ఇచ్చినట్లుగా ఉంది. శోభిత-నాగ చైతన్య మధ్య ఎఫైర్ రూమర్స్ నిజమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సమంత అభిమానులు ఆ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

మరికొందరేమో అది మార్ఫింగ్ ఫొటో అంటున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వేర్వేరుగా దిగిన ఫొటోలను జతచేసి ఎడిట్ చేశారని అంటున్నారు. ఏదేమైనా చైతన్య పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే ఈ ఫొటో బయటకు రావడంతో ఇందులో నిజం ఉండే అవకాశమే ఎక్కువ అని నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు సమంతతో పెళ్లికి ముందు కూడా సమంత-నాగచైతన్య ఇలా సీక్రెట్​గా చట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. విదేశీ వీధుల్లో వీళ్లు సీక్రెట్​గా కలిసి తిరిగిన ఫొటోలు కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత వీళ్లిద్దరు వారి ప్రేమ గురించి అందరికీ చెప్పడం.. పెళ్లి చేసుకోవడం.. హాయిగా కలిసి ఉండటం.. ఆ తర్వాత పలు కారణాలతో విడిపోవడం అదంతా తెలిసిందే.