డిఫరెంట్ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో అడివి శేశ్. మేజర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శేష్ మరో క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు. ఆ మూవీయే హిట్ 2.. ది సెకండ్ కేసు. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్‌ను నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తోంది.
రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇందులో వైజాగ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా అడవి శేష్ టీజర్‌లో కనిపించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఓ యువతి మర్డర్ కేసుని సినిమాలో అడవి శేష్ ఛేదించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా అత్యంత కిరాతకంగా యువతిని నరికి చంపినట్లు టీజర్‌లో చూపించారు. దాంతో సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో మూవీ ఉండబోతోందని అర్థమవుతోంది. తొలి భాగం తరహాలోనే హిట్ 2లో కూడా హీరో, హీరోయిన్స్ మధ్య కొన్ని రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 2న థియేటర్లలోకి రాబోతోంది.
తాజాగా ఈ సినిమాలో నుంచి ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తోంది. ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ ప్రేక్షకులకు ఫీస్ట్‌లాగా ఉండబోతోంది. బ్యూటీఫుల్ విజుల్స్, దానికి తగ్గ ట్యూన్.. మ్యాజిక్ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సాంగ్‌లో అడివి శేష్, మీనాక్షి మధ్య లిప్‌లాక్ సన్నివేశం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ సాంగ్‌పై ఫ్యాన్స్ కాస్త భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు. ఎమ్ఎమ్ శ్రీలేఖ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు. సిద్ శ్రీరామ్ శ్రావ్యమైన గొంతుతో ఈ పాట పాడారు. పూర్తి సాంగ్ నవంబరు 10న విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సాంగ్‌కు సంబంధించి అడివి శేష్ చేసిన ఓ పనిపై నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఇలా కూడా చేస్తారా అని ప్రశ్నించారు. నాని ప్రారంభించిన ‘వాల్ పోస్టర్ సినిమాస్’ బ్యానర్‌పై తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ -2’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వాల్ పోస్టర్ సినిమాస్ కార్యాలయానికి చేరుకున్న శేష్-మీనాక్షి ‘ఉరికే’ పాటకు డ్యాన్స్ చేశారు. ‘‘అవును.. నేను ‘ఉరికే ఉరికే’ పాటకు డ్యాన్స్ చేశా. ఇలా డ్యాన్స్ చేయడం కాస్త సిగ్గుగానే ఉంది. అయినా మీకోసం ఏదైనా చేస్తా’’ అంటూ శేష్ వీడియో షేర్ చేశాడు. దీనిపై నాని స్పందిస్తూ.. ‘‘నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడొచ్చా?’’ అని ప్రశ్నించాడు.
ఈ మూవీలో నుంచి ‘ఉరికే ఉరికే’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం షేర్ చేసింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. దీంతో ఈ పాటను పలువురు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో రీక్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శేష్ – మీనాక్షి సైతం ఈ పాటకు డ్యాన్స్ చేసి వీడియో షేర్ చేశారు.
Yes! I danced to #UrikeUrike 🫢 A bit shy to dance but… anything for YOU guys ❤️
– https://t.co/VjRpTQEYFH#HIT2onDec2@nameisnani @KolanuSailesh @Meenakshiioffl @sidsriram #RamyaBehara@tprashantii pic.twitter.com/VjneepJT7R
— Adivi Sesh (@AdiviSesh) November 12, 2022