Kiyar advani :సీక్రెట్ రివీల్ చేసిన కియారా అడ్వాణీ.. పెళ్లి కబురు చెప్పేసిందా..?

- Advertisement -

బాలీవుడ్ భామలు చాలా మంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆలియా భట్, కత్రినా కైఫ్, రీచా చద్దా, మౌనీ రాయ్, కరీష్మా తన్నాలు ఈ ఏడాది పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు ఈ క్యూలో దబంగ్ బ్యూటీ సోనాక్షి, అతియా శెట్టి, కియారా అడ్వాణీలు ఉన్నారు. ముఖ్యంగా కియారా అడ్వాణీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను ఈ బ్యూటీ వివాహమాడ బోతోందని బీ టౌన్ కోడై కూస్తోంది.

- Advertisement -
siddhart Malhotra and Kiara advani

ఈ నేపథ్యంలోనే కియారా రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే ఓ గుడ్‌న్యూస్ చెబుతానని.. దాచుకోవడం చాలా కష్టంగా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టు చూసిన నెటిజన్లు త్వరలో ఈ బ్యూటీ తన పెళ్లి కబురు చెప్పబోతోందని ఆశపడ్డారు. ఆ న్యూస్ కోసం గత నాలుగైదు రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు కియారా సర్‌ప్రైజ్ రివీల్ చేసింది. కానీ ఆ సర్‌ప్రైజ్ తన పెళ్లి గురించి కాదని తెలిసి ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు.

Kiara and siddhart

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కియారా తను స్టార్ట్ చేసిన ఓ బ్రాండ్ గురించి చెప్పింది. ఈమధ్య బాలీవుడ్ భామలంతా కూడా సొంతంగా బ్యూటీ అండ్ వెల్ నెస్ ప్రొడక్ట్స్ మీద పడ్డారు. అంతకుముందు అలాంటి బ్రాండ్ లకు ప్రకటనలు చేసిన వీరు ఇప్పుడు అలాంటి బ్రాండ్‌లను సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు. కియారా సొంతంగా కిమిరికా అనే కొత్త వెల్ నెస్ ప్రొడక్ట్ బ్రాండ్ మొదలు పెట్టింది.కియరా పేరు వచ్చేలా కిమిరికా అని బ్రాండ్ పేరు పెట్టుకుంది. దీని గురించే ఊరించి ఊరించి చెప్పింది కియరా. ఆమె సొంతంగా వెల్ నెస్ బ్యూటీ ప్రొడక్ట్ బిజినెస్ పెట్టడం ఫ్యాన్స్‌కు హ్యాపీగానే ఉన్నా.. పెళ్లి వార్త కోసం ఎదురుచూసిన వారికి నిరాశే మిగల్చడంతో నిరుత్సాహ పడ్డారు.

ఈ మధ్యే దీపికా పదుకొనే కూడా సొంతంగా వెల్ నెస్ ప్రొడక్ట్ బ్రాండ్ మొదలు పెట్టింది. రెండేళ్లుగా వర్క్ చేసి రీసెంట్‌గా తన బిజినెస్ ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే కే బ్యూటీ ప్రొడొక్ట్స్‌తో కత్రినా కైఫ్, ఎడా మమ్మా బ్రాండ్‌తో ఆలియా భట్ బిజినెస్‌ రంగంలోనూ దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ దారిలోనే కియారా ఎంటర్ అయింది. హీరోయిన్‌ కెరీర్ స్పాన్ తక్కువగా ఉండటం వల్ల ఈ బ్యూటీస్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. అందుకే సైడ్ బిజినెస్ షురూ చేసి సంపాదన కూడబెడుతున్నారు.

బాలీవుడ్ భామ కియరా అద్వాని తన టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ముందు సినిమాల్లో సెకండ్ లీడ్ గా నటించిన కియరా ఆ తర్వాత సోలో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ ఇక్కడ కూడా పాపులర్ అయ్యింది కియారా. మహేష్‌బాబుతో భరత్ అనే నేను మూవీ చేసి హిట్ అందుకోగా ఆ తర్వాత చరణ్‌తో చేసిన వినయ విధేయ రామ మాత్రం అంచనాలను మిస్ అయ్యింది. మరోసారి చరణ్‌తోనే జత కడుతోంది కియారా. శంకర్ డైరక్షన్‌లో వస్తున్న RC15 సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది.

https://www.youtube.com/watch?v=GYUjSTllofg

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here