Hi Nanna : ‘హాయ్ నాన్న’ మూవీ ఫుల్ రివ్యూ..ఎమోషన్స్ తో కన్నీళ్లు రప్పించిన నాని!

- Advertisement -

నటీనటులు : నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కైరా ఖన్నా, శృతి హాసన్, జయ రామ్, ప్రియదర్శి, నాజర్ తదితరులు.

డైరెక్టర్ : శౌరవ్
నిర్మాతలు : మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి
సంగీత దర్శకుడు : హేశం అబ్దుల్ వాహెబ్

ఈ ఏడాది ప్రారంభం లో ‘దసరా’ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సుమారుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో మన ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే ఆసక్తికరమైన ట్రైలర్ తో మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా ఫీలింగ్ ని తీసుకొచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను అలరించిందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.

- Advertisement -

కథ :

విరాజ్ (నాని) వృత్తి రీత్యా ఒక ఫోటోగ్రాఫర్. తన ఆరేళ్ళ కూతురు మహి (కైరా ఖన్నా) తో కలిసి చాలా సింపిల్ లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. అయితే మహి కి తన తల్లి ఎవరో, ఆమె ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. విరాజ్ ని ఎన్నో సార్లు తన తల్లి గురించి అడుగుతూ ఉంటుంది మహి. కానీ విరాజ్ నువ్వు చదువులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే కచ్చితంగా చెప్తాను అని అంటాడు. కానీ విరాజ్ ఇచ్చిన మాట తప్పుతాడు. దీంతో విసుగెత్తిపోయిన మహి విరాజ్ ని వదిలి వెళ్ళిపోతుంది. అలా వెళ్లిపోగా ఒక యాక్సిడెంట్ కి గురి అయ్యే క్రమం లో యష్ణా(మృణాల్ ఠాకూర్) మహి ని కాపాడుతుంది. అలా విరాజ్ మరియు మహి జీవితం లోకి ప్రవేశించిన యష్ణా కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..?, ఇంత మహి తల్లి ఎవరు?, ఎందుకు విరాజ్ ఆరేళ్ళ నుండి ఒంటరిగా గడుపుతున్నాడు వంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరమైన పాయింట్ తో మొదలు అవుతుంది. ఆ తర్వాత స్క్రీన్ ప్లే స్లో గా ఉన్నప్పటికీ కథలో కంటెంట్ ఉండడం తో ఎక్కడా బోర్ కొట్టదు. ఎమోషన్స్ అన్నీ కరెక్ట్ గా ప్లేస్ అయ్యాయి. ముఖ్యంగా నాని మరియు కైరా ఖన్నా మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల మనసులకు బాగా హత్తుకుంటాయి. కథలో అంత ఎమోషన్ మరియు డ్రామా పండే స్కోప్ ఉండడం తో డైరెక్టర్ శౌరవ్ ఎక్కడ కూడా ఛాన్స్ మిస్ చేసుకోలేదు. ఆర్టిస్ట్స్ నుండి పెర్ఫార్మన్స్ ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ నాని మరియు మృణాల్ ఠాకూర్ మధ్య సాగే లవ్ ట్రాక్ మాత్రం రొటీన్ అనిపించింది. అంతే కాకుండా స్లో స్క్రీన్ ప్లే అవ్వడం తో కేవలం A సెంటర్ ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే న్యాచురల్ స్టార్ నాని కి ఇలాంటి పాత్రలు చెయ్యడం కొట్టిన పిండి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పేకాడేసాడు. ఇక ఈ చిత్రానికి గుండె మరియు వెనుముక లాగ నిల్చింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్యారక్టర్. సీతారామం తర్వాత అంతకు మించిన గొప్ప పాత్రతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమాతో ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే చిన్నారి కైరా ఖాన్న నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ అమ్మాయి మాట్లాడినంత స్వచ్ఛమైన తెలుగు చాలా మంది హీరోయిన్స్ కూడా మాట్లాడలేకపోయారు అని చెప్పొచ్చు. అంతే కాకుండా నటన కూడా ఎలాంటి భయం బెరుకు లేకుండా చాలా చక్కగా నటించింది. ఇక హేశం అబ్దుల్ వాహెబ్ అందించిన పాటలు పెద్దగా ఆడియన్స్ కి ఎక్కకపోయినా, నేపధ్య సంగీతం మాత్రం చాలా చక్కగా ఉంది.

చివరి మాట :

ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ‘హాయ్ నాన్న’ చిత్రం మంచి ఎమోషన్స్ ఉన్న డ్రామా సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చే చిత్రం. ఈ వీకెండ్ కుటుంబం తో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చెయ్యండి.

రేటింగ్ : 3/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here