Extra Ordinary Man : మూవీ రివ్యూ..ఆడియన్స్ సహనం కి పరీక్ష పెట్టిన డైరెక్టర్!

- Advertisement -

నటీనటులు : నితిన్, శ్రీలీల, సంపత్ రాజ్, రావు రమేష్, సుదేవ్ నాయర్, రోహిణి, బ్రహ్మాజీ, హైపర్ ఆది తదితరులు.

రచన – దర్శకత్వం : వక్కంతం వంశీ
నిర్మాతలు : సుధాకర్ రెడ్డి
సంగీత దర్శకుడు : హారీస్ జయరాజ్

Extra Ordinary Man : యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న నితిన్ కి గత కొంత కాలం నుండి సరైన సక్సెస్ లేదు. భీష్మ తర్వాత ఆయన చేసిన ప్రతీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఆయన గత చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’ భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన తనకి బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ ని ఎంచుకొని ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ చిత్రం చేసాడు.ఈ సినిమా కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ బాగా వర్కౌట్ అయిన సినిమా అని అందరూ అనుకున్నారు . ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందో లేదో ఈ రివ్యూ లో చూడండి.

- Advertisement -
Extra Ordinary Man
Extra Ordinary Man

కథ :

అభినయ్ (నితిన్ ) టాలీవుడ్ లో ఒక జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఎదో ఒక రోజు పెద్ద సూపర్ స్టార్ అవ్వాలని పిచ్చి కోరిక ఉంటుంది. ఆ సమయం లో అతనికి లిఖిత(శ్రీ లీల) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడిన ఆమె కంపెనీ లో పని చేస్తూ సీఈవో అవుతాడు. అలా జీవితం కొనసాగిస్తున్న అభినయ్ కి ఒక సినిమాలో హీరో గా నటించే ఛాన్స్ దక్కుతుంది. కానీ ఆ తర్వాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. సడన్ గా ఎస్ఐ గా కనిపించి అందరికీ షాక్ ఇస్తాడు. సినిమా హీరో అవ్వాలని అనుకున్న అభినయ్ పోలీస్ గా మారడానికి కారణం ఏమిటి?, ఎందుకు ఆయన ఇలా మారాల్సి వచ్చింది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

టాలీవుడ్ లో టాప్ రైటర్ గా వక్కంతం వంశీ కి ఒక మంచి బ్రాండ్ వేల్యూ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్టర్ గా మారి అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ అనే సినిమా తీసాడు. ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు నితిన్ తో ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా తీసాడు. ఇంత గ్యాప్ తీసుకొని చేసాడు కాబట్టి కచ్చితంగా స్క్రిప్ట్ అడిగిపోయి ఉంటుంది అని అందరూ అనుకోవడం సహజమే. కానీ వక్కంతం వంశీ మాత్రం స్క్రిప్ట్ మీద పెద్దగా ద్రుష్టి పెట్టినట్టుగా అనిపించలేదు. ఆయన గతం లో రాసిన రేస్ గుర్రం , కిక్ 2 వంటి చిత్రాల నుండి కాపీ కొట్టి తీసినట్టుగా అనిపించింది. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ, స్క్రిప్ట్ లో దమ్ము లేకపోవడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు.

సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అని అనిపిస్తాది. నితిన్ జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న సమయం లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నవ్వు రప్పించింది. ఇక పోలీస్ స్టేషన్ లో ఆ డ్యాన్స్ లు చూసే ఆడియన్స్ కి చాలా బోరింగ్ గా అనిపించింది. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ సమయం లో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు నాసిరకం గా మారింది. ఇక నటీనటుల విషయానికి వస్తే నితిన్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం అయితే బాగానే చేసాడు. కాస్త మంచి సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇక శ్రీలీల కేవలం పాటలకు, హీరో తో గిల్లి కజ్జాలు ఆడేందుకు మాత్రమే ఈ సినిమాకి పరిమితం అయ్యింది. ఆమె ఇలా ప్రాధాన్యత లేని సినిమాల్లో నటిస్తూ పోతే కెరీర్ త్వరలోనే ముగిసిపోతుంది అని చెప్పొచ్చు. ఇక హరీశ్ జయరాజ్ అందించిన పాటలు కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు క్లిక్ అవ్వలేదు.

చివరి మాట :

రొటీన్ కమర్షియల్ సినిమా..అక్కడకక్కడ కామెడీ బాగుంటుంది కానీ, సినిమాలో చాలా సన్నివేశాలు వేరే చిత్రాల నుండి కాపీ కొట్టినట్టే అనిపిస్తాయి. నితిన్ కోసం ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here