Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు పెద్ద పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి!

- Advertisement -

Guess The Actress : మన చిన్నతనం నుండి చూస్తున్న సినిమాల్లో కొంతమంది బాల నటులు మనకి తారసపడుతూనే ఉంటారు. ఆ బాలనటులు పెద్దయ్యాక స్టార్ హీరోలుగా మారడమో, లేకపోతే స్టార్ హీరోయిన్స్ గా మారడమో జరుగుతూ వచ్చింది. అలా ఈ క్రింది ఫోటో లో కనిపిస్తున్న ఈ చిన్న అమ్మాయి నేడు సౌత్ లో పెద్ద హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.

Guess The Actress
Guess The Actress

ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్. ఈమె బాలనటిగా ప్రముఖ హీరో రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘రామ బంటు’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాకి బాపు దర్శకత్వం వహించాడు. చూసేందుకు పిచ్చి పిల్ల లాగ కనిపిస్తున్న ఈ అమ్మాయి పెద్దయిన తర్వాత ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈమె అప్పటి హీరో రాజేష్ కి కుమార్తె. అందుకే పలు సినిమాల్లో బాలనటిగా నటించే అవకాశం దక్కింది అని ఐశ్వర్య రాజేష్ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.

Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేష్ తెలుగు లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయ్యుండొచ్చు. కానీ ఆ తక్కువ సినిమాలతోనే ఆమె నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈమె ఫిల్మోగ్రఫీ మొత్తం అత్యధికంగా తమిళం లోనే ఉంటుంది. అందం తో కాకుండా కేవలం నటనతో ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉండే అరుదైన హీరోయిన్స్ లో ఒకరిగా ఐశ్వర్య రాజేష్ నిల్చింది.

- Advertisement -
Aishwarya Rajesh Photos

కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఐశ్వర్య రాజేష్ తో వెబ్ సిరీస్ లు చెయ్యడానికి కూడా అమితాసక్తిని చూపిస్తున్నారు మేకర్స్. అలా ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్ లతో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న ఐశ్వర్య రాజేష్ ఏడాదికి 20 కోట్ల రూపాయిల వరకు సంపాదిస్తుంది అట. సౌత్ లో ఈ రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న హీరోయిన్లు చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. రాబొయ్యే రోజుల్లో ఈమె ఇంకా ఎంత రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here