Balagam: దిల్ రాజు ఎందయ్యా ఇది.. బలగం సినిమాని కాపీ కొట్టావా.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన జర్నలిస్టు గడ్డం సతీష్..

- Advertisement -

Balagam: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో దిల్ రాజు నిర్మాణ సంస్థల్లో భాగమైన దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందించిన సినిమా బలగం.. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , జయరాం తదితర తారాగణంతో ఈ సినిమా మార్చి 3వ తారీఖున తెరకెక్కింది.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలవగా.. నిన్న ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్రీమియర్ షో చూసిన ప్రముఖ జర్నలిస్టు గడ్డం సతీష్ ఈ బలగం సినిమా కథ నాదేనని మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Balagam

ప్రముఖ తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో పనిచేసే జర్నలిస్టు గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదేనని అంటున్నారు. ఈ కథను నేను 2011 డిసెంబర్ 24వ తేదీన నమస్తే తెలంగాణలో పచ్చికి అనే పేరుతో ఆదివారం మ్యాగజైన్ లో రాసానని ఆయన తెలిపారు. నా కథలో కాస్త మార్పులు చేర్పులు చేసి దిల్ రాజు ఈ కథను కమర్షియల్ సినిమాగా తీసి డబ్బులను ఆయన జేబులో వేసుకుంటున్నాడని గడ్డం సతీష్ అన్నారు. 2011లో రాసిన పచ్చి కి కథను 2014లో నమస్తే తెలంగాణలోని బతుకమ్మలు కూడా అచ్చు వేశారని తెలిపారు.

పచ్చికి అంటే పక్షికి అని అర్థం. సాధారణంగా మనుషులు చనిపోతే పక్షులకు ఆహారం పెడతారు. మనిషి చనిపోయిన తర్వాత మూడు , ఐదు, ఏడవ రోజుల్లో పక్షికి ముద్ద పెడతారు. పక్షికి పెట్టేదాన్ని పచ్చికి అనే కథగా రాశాను. బలగం అనే పదం కూడా కరెక్ట్ కాదు. బల్గం అనేది సరియైన పదం అని సతీష్ తెలిపారు. ఈ సినిమా కథ నాదేనని అందుకు నిదర్శనమే పచ్చికి కథ అని.. నాకు రావలసిన గుర్తింపు నాకు ఇవ్వాలని గడ్డం సతీష్ తెలిపారు.

- Advertisement -

కొన్ని సినిమాలలో వాళ్లు రాసిన కొన్ని కొన్ని పదాలను, పాటలుగా వాడుకుంటేనే ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్నో గొడవలు చేస్తున్నారు. అలాంటిది నేను రాసిన పచ్చికి కథను 90 శాతం తీసుకొని సినిమాగా మార్చారు. బలగం సినిమా కధ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలని.. ఈ విషయాన్ని వారే అధికారికంగా అనౌన్స్ చేస్తే చాలా సంతోషమని.. లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా మీడియా ముఖంగా జర్నలిస్ట్ గడ్డం సతీష్ తెలిపారు. నేను ఎలాంటి మోసం చేయడం లేదని 2011లో వచ్చిన నా పచ్చికి కథను 2023లో బలగం సినిమా తీశారని అంతకంటే మరొక నిదర్శనం ఏం కావాలి.. ఎలాంటి ప్రూఫ్ కావాలి అని చెబుతూ నాకు న్యాయం కచ్చితంగా కావాలి చెబుతున్నారు. జర్నలిస్ట్ గడ్డం సతీష్ కి న్యాయం జరగాలంటే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here