Ram Charan : తండ్రి సినీ కెరీర్ ని హాలీవుడ్ ఆడియన్స్ ముందు తక్కువ చేసి మాట్లాడిన రామ్ చరణ్..ఆగ్రహం లో మెగా ఫ్యాన్స్

- Advertisement -

మెగా పవర్ స్టార్ Ram Charan ప్రస్తుతం అమెరికా లో జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొనడానికి ముందుగా జరుగుతున్నా ప్రమోషన్స్ లో పలు హాలీవుడ్ మీడియా చానెల్స్ కి ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్యనే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నీకు బాగా ఇష్టమైన నాలుగు ఇండియన్ మూవీస్ పేర్లు చెప్పండి అని అడగగా దానికి రామ్ చరణ్ ఇచ్చిన రియాక్షన్ అందరిని షాక్ కి గురి చేసింది.

Ram Charan
Ram Charan

ఆయన మాట్లాడుతూ ‘నాకు బాగా ఇష్టమైన సినిమాలు దాన వీర సూరకర్ణ,బాహుబలి, రంగస్థలం , మిస్టర్ ఇండియా’ అని చెప్తాడు. ఇలా వరుసగా ఇతర హీరోల సినిమాల పేర్లని చెప్పేసాడు కానీ, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మాత్రం అసలు గుర్తుకు రాలేదా అని మెగా ఫ్యాన్స్ ఈ సందర్భంగా రామ్ చరణ్ ని సోషల్ మీడియా లో నిలదీస్తున్నారు.

Ram Charan AT HCA

చిరంజీవి కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయని, రుద్రా వీణ వంటి గొప్ప సినిమా ఉందని, దానికి నేషనల్ అవార్డు కూడా దక్కింది అంటూ గుర్తు చేసారు. అంతే కాదు తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మటు ని మార్చిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమే అని, డ్యాన్స్ ఫైట్స్ ఇలా అన్ని విధాలుగా టాలీవుడ్ ని కొంత పుంతలు తొక్కించిన చిరంజీవి, తాను తీసిన 150 కి పైగా సినిమాలలో చెప్పుకోదగినవి ఎన్నో ఉన్నాయని, రామ్ చరణ్ కి అవన్నీ ఎందుకు గుర్తు రాలేదో అర్థం కావడం లేదని, అంతర్జాతీయ మీడియా చానెల్స్ లో తన తండ్రి పేరు చెప్పుంటే ఎంతో సంతోషించే వాళ్లమని ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ తెలిపారు.

- Advertisement -
Ram Charan For Oscars

మరోపక్క రామ్ చరణ్ ‘దాన వీర సూరకర్ణ’ సినిమా పేరు చెప్పడం నందమూరి ఫ్యాన్స్ ని సంతోషపర్చింది. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నిజాయితీగా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పిన రామ్ చరణ్ కి కృతఙ్ఞతలు అంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియా లో చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here