Avantika Vandanapu : మహేష్‌బాబును అలా చేయాల్సి వచ్చింది..! కానీ.. వాళ్లంటే చాలా ఇష్టం..

- Advertisement -

Avantika Vandanapu అచ్చ తెలుగు అమ్మాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. ‘బ్రహ్మోత్సవం’తో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె ‘స్పిన్’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం అక్కడ హాట్ ఫేవరెట్ గా మారుతోంది. అయితే ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవాలు ప్రేక్షకులతో పంచుకుంది. నేను కాలిఫోర్నియాలో పుట్టి పెరిగాను. నాకు పదేళ్ల వయసులో ఓ ఛానెల్ నిర్వహించిన ‘డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్’ (నార్త్ అమెరికన్ ఎడిషన్) షో కోసం ఇండియా వచ్చి పోటీలో రన్నరప్‌గా నిలిచాను. అలా ‘బ్రహ్మోత్సవం’లో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత తెలుగులో ‘ప్రేమమ్‌’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘అజ్ఞాతవాసి’… తమిళంలో కూడా నటించానని అవంతిక చెప్పారు. ఆ సమయంలోనే డిస్నీ ఛానెల్ వారు ‘స్పిన్’ సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకుని ఇక్కడి నుంచి టేప్ పంపించారు. నాలుగు నెలల పాటు ఆడిషన్ చేసిన తర్వాత, ఆశ్చర్యకరంగా నన్ను లీడ్ క్యారెక్టర్ కోసం ఎంపిక చేశారు. దాంతో నేను తిరిగి అమెరికా వెళ్లాడు.

Avantika Vandanapu
Avantika Vandanapu

ఇంట్లో తెలుసు…
తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో అవలీలగా మాట్లాడుతాను. మా అమ్మా నాన్న తెలంగాణా వాళ్ళు కాబట్టి ఇంట్లో తెలుగు మాత్రమే మాట్లాడతాం. తెలంగాణ యాస నాకు బాగా ఇష్టం. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వంటింట్లోకి వెళ్లి వంట చేస్తుంటాను. నేను చేసే కేక్‌లను ఎవరైనా సరే లొట్టెలు వేసుకుంటూ తినాల్సిందే. అందుకే నేను చేసిన కేక్‌ని ఎవరి వద్దకు వెళ్లినా ఇస్తుంటాను.

- Advertisement -

ఇష్టమైన ప్రదేశాలలో హైదరాబాద్ ఒకటి. ముఖ్యంగా సుల్తాన్ బజార్‌లో కనిపించే గాజులు నాకు చాలా ఇష్టం. స్వేచ్ఛ, ప్రజాహక్కు వంటి షార్ట్ ఫిల్మ్‌లతో పాటు కొన్ని కమర్షియల్‌ సినిమాల్లోనూ నటించాను. డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీస్‌లో నటించిన మొదటి ఇండో-అమెరిన్ అమ్మాయి నేనే అని చాలా మందికి తెలియదు. భవిష్యత్తులో స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలనేది నా ఆలోచన. కూచిపూడి, కథక్ నేర్చుకున్నారు. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ఉంది. అప్పుడప్పుడు గుర్రపు స్వారీ మరియు బ్యాడ్మింటన్‌కు సమయం కేటాయిస్తుంటాను. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి కానీ… ఇప్పుడు చేసే ఆలోచన లేదు. దీనికి మరికొంత సమయం ఉంది.

 Avantika Vandanapu Movies

స్కూల్‌లో నా తోటివారిందరూ నా ఆహారం,అలవాట్లను ఎగతాళి చేసేవారు. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. విదేశాల్లో ఉండడంతో మొదట్లో అర్థం కాలేదు. పదేళ్ల వయసులో ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి మన సంస్కృతి బాగా నచ్చింది. దాంతో మనవైన ఆచార వ్యవహారాలపై నాకు ఆసక్తి పెరిగింది. నేను అమెరికా వెళ్లినా వాటిరు ఫాలో అయ్యాను. సంప్రదాయం, పాశ్చాత్యం… ఏది వేసుకున్నా బొట్టు పెట్టుకోవడం మాత్రం పక్కా.

యాక్టింగ్, ఫ్యాషన్.. ఇలా దేనికైనా నా మార్క్ ఉండాలి. దర్శకుల్లో రాజమౌళి, సంజయ్ లీలా బన్సాలీ, శేఖర్ కమ్ముల, విధు వినోద్ చోప్రా అంటే ఇష్టం. వీరంతా స్త్రీ పాత్రలను తెరపై చాలా పవర్ ఫుల్ గా చూపించారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ నాకు ఇష్టమైన హీరోలు. మొదటి సినిమాతోనే మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ‘బ్రహ్మోత్సవం’ విడుదల సమయంలో మహేష్‌బాబుని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయనకు పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాను. అయితే మహేష్‌కి ఇంటర్వ్యూ చేయడం అంటే చాలా ఇష్టమని.. ఇప్పుడు అలా చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని సీన్స్‌ ని ఇన్‌స్టా రీల్‌గా వస్తున్నాయని, అవి చూసి నవ్వుకుంటున్నానని చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here