Guess The Director : పై ఫోటోలో కనిపిస్తున్న పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా ?

- Advertisement -


Guess The Director : సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్టార్ సెలబ్రిటీలందరికీ దాదాపు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ అభిమాన సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, వ్యక్తిగత విషయాలను మరో సారి నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు. వారు నటిస్తున్న సినిమా అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటున్నారు. త్రోబాక్ థీమ్‌తో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొన్నేళ్ల క్రితం తన భార్యతో కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. పై ఫోటోలో కనిపిస్తున్న పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా ?

Guess The Director
Guess The Director

ఆయన అల్లు అర్జున్, నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బంపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో కూడా కనిపించి మెప్పించాడు. గతేడాది నిర్మాతగా మారి హారర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ ఏడాది అల్లు అర్జున్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇంతకీ ఈ స్టార్ట్ డైరెక్టర్ ఎవరో గుర్తుందా.. ఎస్ మీరు ఊహించింది కరెక్ట్. ఆయనే సుకుమార్. తనతో ఉన్నది అతని భార్య తబిత. తాజాగా సుకుమార్ భార్య తబిత ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2004లో తీసిన ఈ ఫొటోతో పాటు ఈ ఏడాది తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Sukumar

నీ ప్రేమను పొందడం నా అదృష్టం.. చాలా మధురంగా ఉంది. హ్యాష్‌ట్యాగ్ 20 సంవత్సరాల ప్రయాణాన్ని జోడించింది. అయితే అప్పుడు.. ఇప్పుడు సుకుమార్‌కి అసలు పోలికే లేదు. ఈ రెండు ఫోటోల్లో అసలు సుకుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు సుకుమార్ నిర్మించిన విరూపాక్ష చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here