Chiranjeevi vs Balakrishna : బాక్సాఫిస్ వద్ద 9 సార్లు పోటీ.. ఎవరు ఎన్ని హిట్లు కొట్టారు??

Chiranjeevi-Balakrishna


Chiranjeevi vs Balakrishna : సంక్రాంతి వచ్చిందంటే సరదాల తో పాటు.. సినిమాల సందడి కూడా ఉంటుంది.. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా స్టార్ హీరోల సినిమాలు తల పడనున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి టాక్ ను అందుకున్నాయి. అందులో సీనియర్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు అయితే ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటూ వస్తున్నాయి. అయితే సంక్రాంతి ఫైట్ లో నందమూరి బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే 9 సార్లు పోటీపడ్డారు. ఇప్పుడు మరోసారి వారు పోటీకి సిద్ధమయ్యారు. ఇక ఎవరు ఎన్ని సార్లు హిట్లు కొట్టారో తెలుసుకుందాం..

Chiranjeevi - Balakrishna
Chiranjeevi vs Balakrishna

1985 లో సంక్రాంతికి వీరిద్దరి మధ్య పోటీ మొదలయ్యింది. .నందమూరి బాలకృష్ణ ఆత్మబలం అనే సినిమా వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి చట్టంతో పోరాటం అనే సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో చిరంజీవి సినిమా మాత్రమే సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత 1987లో చిరంజీవి దొంగ మొగుడు అనే సినిమాతో రాగా నందమూరి బాలకృష్ణ భార్గవ రాముడు అనే సినిమాతో వచ్చాడు. ఇందులో కూడా మళ్లీ మెగాస్టార్ చిరంజీవి పై చేయి సాధించారు..

manchi donga inspector prathap
manchi donga inspector prathap

ఆ తర్వాత 1988 లో మెగాస్టార్ చిరంజీవి మంచి దొంగ అనే సినిమాతో వచ్చాడు. ఇక అప్పుడు బాలకృష్ణ ఇన్స్ పెక్టర్ ప్రతాప్ సినిమా కూడా విడుదలైంది. ఇక ఈ రెండిటిలో మళ్లీ మెగాస్టార్ మంచి దొంగ భారీ విజయాన్ని అందుకుంది.. అదే విధంగా 1997లో మెగాస్టార్ హిట్లర్ సినిమాతో బాలకృష్ణ పెద్దన్నయ్య అనే సినిమాతో వచ్చారు.ఆ రెండు కూడా బాక్సాఫిస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి.

sneham kosam samhara simha reddy
sneham kosam samhara simha reddy

ఇక మళ్ళీ రెండేళ్ల తర్వాత 1999లో మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం సినిమాతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోక నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఆ ఏడాది మొత్తానికి ఇండస్ట్రీ హిట్ అయ్యింది.2000వ సంవత్సరంలో బాలకృష్ణ వంశోద్ధారకుడు అనే సినిమాతో వచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

mrugaraju narasimha reddy
mrugaraju narasimha reddy

ఇందులో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.. 2001లో నందమూరి బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో మరో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఇక అప్పుడే మెగాస్టార్ చిరంజీవి నుంచి భారీ అంచనాలతో మృగరాజు అనే సినిమా వచ్చింది. అది బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టింది.. ఇకపోతే 2004లో మరోసారి బాలకృష్ణ లక్ష్మీనరసింహ అనే సినిమాతో సక్సెస్ అందుకోగా మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాతో మరో ప్లాఫ్ అయ్యింది.. 2017లో ఖైదీ నెంబర్ 150 వచ్చింది. ఇక బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా అప్పుడే వచ్చింది.

ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతాయని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు..మరి ఇప్పుడు ఎవరికీ విజయం వరిస్తుందో, ఏ సినిమాకు కలెక్షన్స ల వర్షం కురుస్తుందొ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందె మరి.. నిజానికి వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి చిత్రాల‌ను ఒకే ప్రొడ‌క్ష‌న్ హౌస్ నిర్మించ‌డం, సినిమాలు రెండు విజ‌యం సాధిస్తాయ‌నే న‌మ్మ‌కం ఉండ‌టం వ‌ల్లే ఈసారి బరిలోకి దిగాయి..మరి ఈ రెండూ కూడా విజ‌యం సాధించాల‌ని కోరుకుందాం…