Walthair Veeraya : ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఆ టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలుసా..?

- Advertisement -

Walthair Veeraya : పూనకాలు లోడింగ్‌.. పూనకాలు లోడింగ్‌.. అంటూ దర్శకుడు బాబీ చెబుతుంటే ఏంటా? అని అందరూ అనుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌తో టేస్ట్‌ ఏంటో చూపించారు. ఇక థియేటర్‌లో పూనకాలు కాదు.. అంతకుమించి ఉండొచ్చని చెప్పకనే చెప్పేశారు. చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Walthair Veeraya
Walthair Veeraya

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకు ఆ టైటిల్ ఎలా వచ్చింది.. దాని వెనక ఉన్న కథేంటి.. డైరెక్టర్ బాబీకి చిరంజీవితో పనిచేసే అవకాశం ఎలా వచ్చింది.. ఈ మూవీలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలను డైరెక్టర్ బాబీ ప్రేక్షకులతో పంచుకున్నారు. 

Bobby
Bobby

అసలు ఈ మూవీకి వీరయ్య అనే టైటిల్ ఎలా పెట్టామంటే.. ‘వెంకీ మామ’ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్‌తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్లలో ఉన్నప్పుడు ఆయన నాన్నగారు ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోలతోనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్‌గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం. అని టైటిల్ వెనక ఉన్న స్టోరీ చెప్పేశారు.

- Advertisement -

“‘వాల్తేరు వీరయ్య’ అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ బాబీ ఏమన్నారంటే..  చిరంజీవి గారికి ఉన్న లక్షలమంది అభిమానుల్లో నేనూ ఒకడిని. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన సినిమాలో పనిచేయాలని ఉండేది. దాదాపు 20ఏళ్ల తర్వాత ఏకంగా ఆయనను డైరెక్ట్‌చేసే అవకాశం లభించింది. ఒక అభిమానిగా, మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారో దాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశా. లాక్‌డౌన్‌ కన్నా ముందే చిరంజీవిగారికి ఈ కథ చెప్పా. అయితే, కరోనా తర్వాత అత్యధికమంది ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి, రవితేజ పాత్రను తీసుకొచ్చా. ఈ విషయం చిరంజీవిగారికి కూడా చెబితే ఆయన వెంటనే ఓకే అన్నారు. ఇక  రవితేజ అతిథి పాత్రలో కనిపిస్తారా? పూర్తి స్థాయిలో కనిపిస్తారా? అన్నది మీరు తెరపై చూడాల్సిందే. ఎందుకంటే ఎన్ని మాస్‌ అంశాలు ఉన్నా, ఇందులో కథే ప్రధానమైంది.” అని బాబీ అన్నారు.

“వాల్తేరు వీరయ్య సినిమాలో ‘ముఠామేస్త్రీ’, ‘గ్యాంగ్‌లీడర్’ లాంటి వింటేజ్ లుక్ కనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ పాత్రలో ఆ లిబర్టీ ఉంది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు, బీడీ తాగొచ్చు, రౌడీ అల్లుడు స్వాగ్ ఉండొచ్చు. ‘గ్యాంగ్ లీడర్’లా గన్ పట్టుకొని వార్‌కి రావచ్చు. ఆ ఫ్రీడమ్ అంతా వీరయ్య క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది తప్పితే బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు. ఇందులో చిరంజీవి డ్యాన్స్‌తో పాటు ఫన్ టైమింగ్ అదిరిపోతుంది. ఎందుకంటే ఆయన అందులో మాస్టర్‌. మా సినిమా కొత్తగా ఉండటంతో పాటు, మాస్‌కు బాగా దగ్గరవ్వాలని ‘పూనకాలు లోడింగ్‌’ అనే ట్యాగ్‌ అనుకున్నాం. మేము అనుకున్నట్లే ఇప్పుడు అందరూ లోడింగ్ అనే మాటని పాజిటివ్ వైబ్‌గా వాడుతున్నారు. ఈ విషయంలో మేము సక్సెస్ అయ్యాం.” అని బాబీ చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here