Shaakuntalam : విజువల్‌ వండర్‌గా ‘శాకుంతలం’ ట్రైలర్.. సమంత ఎంత అందంగా ఉందో..?Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సమంత నటించిన శాకుంతలం సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేళకు ఫ్యాన్స్ కోసం ఆ చిత్రబృందం ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. విజువల్ వండర్‌గా ఈ సినిమా కూడా ఓ అద్భుతం చేయబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీలో సామ్ చాలా చాలా అందంగా కనిపిస్తోంది. ఇక గ్రాంథికంలో ఉన్న ఈ మూవీ డైలాగ్స్‌ను సమంత అలవోకగా చెప్పేసింది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఈ మూవీకి ఓ హైలైట్ అని చెప్పుకోవచ్చు.

Shaakuntalam
Shaakuntalam

‘‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’’ అంటూ సామ్ గద్గ స్వరంతో చెప్పిన డైలాగ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నటించగా మలయాళ హీరో దేవ్ మోహన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. గుణశేఖర్‌ దర్శకుడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సమంత నటన, నటీనటుల సంభాషణలు అదరగొట్టేలా ఉన్నాయి.

‘‘స్వచ్ఛమైన తన ప్రేమ కోసం దుర్వాసుల వారి ఆగ్రహానికి.. కష్యపు మహర్షుల వారి అనుగ్రహానికి నడుమ ఆమె పడే కష్టాలు భూమాతకు సైతం భారమే. అయితే, కర్మకు ఎవరూ అతీతులు కారు’’ అంటూ సమంతను ఉద్దేశిస్తూ వచ్చే డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Actress Samantha
Actress Samantha

ఇటీవలే ‘శాకుంతలం‘ మూవీ రిలీజ్​ డేట్​ను చిత్ర బృందం అనౌన్స్​ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సమంత సోషల్​ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమాను త్రీడీలో కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దీన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాశారు.