Pushapa 2 : ఆరోజే పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. DSPని పుష్పరాజ్ అయినా ఆదుకుంటాడా..?

- Advertisement -

Pushapa 2 : DSP.. దేవీ శ్రీ ప్రసాద్.. ఒకప్పుడు ఈ పేరు అంటే టాలీవుడ్ కు ఓ వరం లాంటిది. దేవి మ్యూజిక్ చేస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. ఇప్పటికీ చాలా మంది దర్శకులకు ఈ రాక్ స్టార్ ఓ సెంటిమెంట్. పర్టిక్యులర్ దర్శకుల వద్ద పని చేసే అప్పుడు దేవీ సూపర్ మ్యూజిక్ ఇస్తాడు. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడు. కానీ కొంత కాలంగా డీఎస్పీ పాటల్లో ఆ మ్యాజిక్ కనిపించడం లేదు. పాటల్లోనే కాదు.. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీల్లో లేటెస్ట్ గా వస్తున్న చిత్రాల్లో దేవి పేరే వినిపించడం లేదు. ఎందుకలా.. ఆయనకు అవకాశాలు రావడం లేదా.. లేదా దేవీయే తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నాడా.. అసలు ఆ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కు ఏమైంది..

Pushapa 2
Pushapa 2

ఒకప్పుడు సంక్రాంతికి పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అందులో 7 చిత్రాలకు మ్యూజిక్ దేవీశ్రీప్రసాద్ ఇచ్చేవాడు. సమ్మర్ స్పెషల్ మూవీస్ వస్తున్నాయంటే.. అందులోనూ ఎక్కువగా దేవీ పేరే వినిపించేది. ఇక ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇప్పుడు.. మొనాటనీ వచ్చేసింది కానీ.. అప్పట్లో దేవీ మ్యూజిక్ అందించిన సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే.. ఓ జోష్ ఉండేది. స్వయంగా తానే పాటలు పాడుతూ.. అప్పుడప్పుడు హీరోలతో పాడిస్తూ.. వాళ్లతో స్టేజ్ మీద స్టెప్పులు కూడా వేయించడం కేవలం ఈ రాక్ స్టార్ కే సొంతం.

- Advertisement -

అలాంటి డీఎస్పీ ఇప్పుడు స్లో అయ్యాడు. ఈ మధ్య కథలను సెలెక్ట్ చేసుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రోజుకు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న నేటి తరంలో క్వాంటిటీ కంటే క్వాలిటీయే ముఖ్యమని నమ్మే దేవి ఆ దిశగా తనకు నచ్చిన సినిమాలకే మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. అందుకే గత 15 ఏళ్ల నుంచి చూస్తే ఏడాదికి కనీసం పది సినిమాలతో బిజీగా ఉండే డీఎస్పీ.. గతేడాది కేవలం చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో మాత్రమే ముందుకొచ్చాడు. అందులోనూ మ్యూజిక్ అంతగా మ్యాజిక్ చేయలేదు. అప్పటి రాక్ స్టార్ మ్యాజిక్ మిస్ అయిందని ఫ్యాన్స్ భావించారు.

దేవి కమర్షియల్ సినిమాలకు దూరం కావడం తమన్, అనిరుధ్ లకు హెల్ప్ అవుతోంది. నిర్మాతలు ఇప్పుడు వీళ్లనే తమ ఛాయిస్ గా తీసుకుంటున్నారు. అయితే దేవీ మళ్లీ పికప్ అయ్యి.. బిజీ అవ్వాలంటే.. తన చేతిలో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ఆయుధం.. పుష్ప-2. డైరెక్టర్ సుకుమార్ కు దేవీ తప్ప మరే మ్యూజిక్ డైరెక్టర్ చేసే మ్యూజిక్ ఎక్కదు. అందుకే తన ప్రతి చిత్రంలో డీఎస్పీకే ఆ పని అప్పజెప్తాడు. అయితే పుష్ప సాంగ్స్ కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే కదా. అందులో ఊ.. అంటావా సాంగ్.. శ్రీవల్లి పాట.. కేవలం తెలుగులోనే కాదు.. ఇండియా మొత్తం ఈ పాటలకు ఫిదా అయిపోయింది. ఇండియానే కాదు విదేశాల్లో కూడా చాలా మంది ఈ సాంగ్స్ కు మెస్మరైజ్ అయ్యారు.

అలా దేవి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన చిత్రంగా పుష్ప నిలిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ది వారియర్, ఎఫ్ 3, ఖిలాడి, రంగ రంగ వైభవంగా లాంటి సినిమాల్లో  సాంగ్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు.  ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 ఆల్బమ్స్ తో మళ్లీ  బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది.

త్వరలోనే ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నారుట. మే ఫస్ట్ వీక్ లోనే ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉందని టాక్. పుష్ప ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ ఎంతగా క్రేజ్ అందుకున్నాయో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ రావాల్సి ఉంది.  పుష్పరాజ్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా చంద్రబోస్ ఓ పాటను రాసినట్లు సమాచారం. ఆ లిరిక్స్ కు దీటుగా దేవిశ్రీప్రసాద్ మంచి ట్యూన్స్ అందించినట్లు తెలిసింది. ఈ పాట మేకింగ్ విధానం ఊర మాస్ గా ఉండబోతోందట. మరి దేవిశ్రీప్రసాద్ ఈసారి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here