Pushpa 2 : పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సీక్రెట్ గా మెయింటేన్ చేస్తున్నారు మావా

- Advertisement -

Pushpa 2 : మెగా సపోర్టు ఉన్నప్పటికీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కష్టపడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని రికార్డులు సృష్టించాడు. చివ‌రిగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ అందుకున్నాడు అల్లు అర్జున్.. ఈ సినిమాలో తన స్టైల్ ఆఫ్ మేనరిజం తో భారీ లెవెల్ లో ప్రేక్షకులను ఆకర్షించాడు. ఇప్పుడు ఆయన పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు ఇప్పటికే రికార్డు స్థాయిలో జరిగాయని తెలుస్తోంది. ఇప్పటివరకు మరి ఏ ఇండస్ట్రీకి చెందిన ఏ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అత్యధికంగా రూ.1000 కోట్ల వరకు వరుస‌ బిజినెస్‌లు జరిగినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రష్మికతో పాటు ఓ బాలీవుడ్ హీరోయిన్ ఉండబోతుందని.. అయితే ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది రిలీజ్ అయ్యే వరకు సస్పెన్స్ గా పెట్టి సినిమా ఇంటర్వెల్లో రివీల్ చేయబోతున్నారని తెలుస్తోంది.

- Advertisement -
pushpa 2
pushpa 2

అయితే ఆమె మరెవరో కాదు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అని సమాచారం అందుతుంది. కానీ ఆ హీరోయిన్ ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. థియేటర్‌లో సినిమా చూసినప్పుడు మాత్రమే ఆ హీరోయిన్ ఎవరనే విషయం క్లారిటీ వచ్చేలాగా.. అప్పుడే ఆ హీరోయిన్ క్యారెక్టర్‌ను రివీల్ చేసేలా మేకర్స్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారట. ఇక బన్నీ ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే ఆయన మార్కెట్ మరో లెవెల్ కి వెళ్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here