kalki 2898 AD మూవీ నుంచి మరో దిమ్మదిరిగే అప్డేట్.. ఇక థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే

- Advertisement -

kalki 2898 AD : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ. ఈ మూవీ తాజాగా ఓ సూపర్ అప్డేట్ ను ఇచ్చింది. ఇందులో అమితాబ్‌ పాత్రను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నట్లు రివీల్ చేసింది. అయితే తాజా ఈ చిత్రం గురించి మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే

kalki 2898 AD
kalki 2898 AD

కల్కి మూవీలో ఇప్పటికే సూపర్ స్టార్ నటులు భాగమవుతున్న విషయం తెలిసిందే. వివిధ భాషల ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో మరో ఇద్దరు స్టార్ హీరోలు భాగం కాబోతున్నారట. వాళ్లు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్లే కావడం మరో విశేషం. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ లో ఇప్పటికే అగ్ర తారలు భాగం కాగా ఇప్పుడు మరికొందరు స్టార్ నటుల పేర్లు తెరపైకి వచ్చాయి.

- Advertisement -

కల్కిలో టాలీవుడ్‌ హీరోలు నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో ది విజయ్‌ దేవరకొండ నటించనున్నారట. ఈ ఇద్దరు ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేయనున్నట్లు టాక్. వీళ్లే కాకుండా మలయాళ నటి అన్నాబెన్‌ కూడా ‘కల్కి’లో నటించనున్నట్లు తాజాగా స్వయంగా చెప్పారు. ఇక మలయాళం నుంచి ఇప్పటికే ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇలా అగ్ర నటీనటులతో పాటు యువతారలు కూడా కనిపించనున్నట్లు తెలియడంతో చిత్రంపై అంచనాలు డబుల్ అయ్యాయి.

నాగ్‌అశ్విన్‌ ఇలా పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకోవడం వెనక పక్కా ప్లాన్ ఉందని టాక్. ఈ సినిమాను ఇండియాలోని పలు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని భాషల్లో ప్రమోషనస్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే అక్కడి ప్రముఖ నటులను ఇందులో భాగస్వామ్యం చేయాలని నాగ్ భావించాడట. అలా ప్రభాస్ తో పాటు.. తెలుగులో నాని, విజయ్‌ దేవరకొండ.. తమిళంలో కమల్‌హాసన్‌.. హిందీలో అమితాబ్‌, దీపికా పదుకోణ్, దిశా పటాని.. కేరళలో అన్నాబెన్‌, దుల్కర్‌లు ప్రమోషన్స్ చేస్తారని టాక్.

మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథగా నాగ్ అశ్విన్ స్టోరీ ప్లాన్ చేశాడట. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుందట. గతం, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా భారతీయతని ప్రతిబింబించేలా సరికొత్త ప్రయత్నాలు సృష్టించారట. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here