Aha Okati Adakku Trailer : పెళ్లి కోసం నరేష్ అల్లరి పాట్లు చూస్తే నవ్వాగదు

- Advertisement -

టాలీవుడ్ నటుడు అల్లరి నరేశ్.. మరోసారి తన అల్లరితో మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేశాడు. గత కొన్ని రోజుల నుంచి నరేశ్.. సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. అయితే ప్రేక్షకులు తనలోని కామెడీని మాత్రం కొంతకాలంగా మిస్ అవుతున్నారు. వారి కోసమే అల్లరి నరేశ్.. మరోసారి నవ్వించేందుకు ఔట్ అండ్ ఔట్ కామెడీతో మనముందుకు వచ్చేస్తున్నాడు. అయితే ఈసారి ఆయన పెళ్లి కాని యువకుడిగా కనిపించబోతున్నాడు. పెళ్లి కోసం ఆరాటపడే ఓ యువకుడు.. ఓ సంబంధం కుదుర్చుకోవడానికి ఎంత తాపత్రయ పడుతున్నాడో ఆయన నటించిన ఆ ఒక్కడీ అడక్కు అనే సినిమా చూస్తే తెలిసిపోతుంది.

 

aa okkati adakku trailer

- Advertisement -

అల్లరి నరేశ్ తాజాగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. ఇందులో జాతిరత్నాలు ఫేం చిట్టి అదేనండి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కాసేపట్లోనే రికార్డు వ్యూస్ అందుకుని దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ప్రజెంట్ యూత్ ఎదుర్కొంటున్న పెళ్లి సమస్యను కామెడీగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 49 సార్లు రిజెక్ట్ కావడంతో చివరికి మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తాడు నరేశ్. ఆ తర్వాత ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో అల్లరి నరేశ్ తన కామెడీ టైమింగ్ తో పాటు.. ఫరియా అబ్దుల్లా పంచ్ లు హైలైట్ అయ్యాయి.

వెన్నెల కిషోర్, షకలక శంకర్, వైవా హర్ష వంటి వారు కూడా సినిమాలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలు చేసినట్లు అనిపిస్తుంది. ఇక ట్రైలర్ లాస్ట్ లో కాస్త యాక్షన్ యాడ్ చేశారు. ఈ మూవీలో లవ్, కామెడీతో పాటు ఓ సీరియస్ మెసేజ్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూస్తే అర్థమవుతోంది.

ఇక ట్రైలర్ చివరలో బంధువుల వల్ల ఇబ్బంది పడే యువకులకు నచ్చే విధంగా అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్ మరింత హైలైట్ అయ్యింది. గోపీ సుందర్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ కు సరైన మూడ్‌ ని సెట్ చేశాడు. ఇక ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఈ చిత్రం మే 3వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. చాలా రోజుల తరువాత నరేష్ నుంచి వస్తున్న కామెడీ సినిమా కావడంతో తప్పకుండా హిట్ అవుతుంది అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here