బ్రహ్మానందం కొడుకు ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడా..! అతని నెల సంపాదనతో భారీ బడ్జెట్ సినిమా తీసేయొచ్చు!

- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఒక కమెడియన్ ని చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టడం జరిగింది ఒక్క బ్రహ్మానందం విషయం లో మాత్రమే. చిరంజీవి చొరవతో జంధ్యాల తెరకెక్కించిన ‘చంటబ్బాయ్’ అనే చిత్రం లో చిన్న పాత్ర ద్వారా మెరిసిన బ్రహ్మానందం, మళ్ళీ అదే జంధ్యాల తెరకెక్కించిన ‘అహనా పెళ్ళంటా’ సినిమా లో బ్రహ్మానందం కి కమెడియన్ పాత్రని ఇచ్చాడు. ఈ పాత్ర ఆయన కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

బ్రహ్మానందం
బ్రహ్మానందం

బ్రహ్మానందం ఈ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనతి కాలం లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగి, తాను లేని సినిమానే లేదనేంత రేంజ్ కి ఎదిగాడు. ఒకానొక దశలో ఆయన ఏడాదికి 50 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఆయన దాదాపుగా వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు.

అయితే ఆయన కొడుకు గౌతమ్ మాత్రం ఆశించిన స్థాయిలో ఇండస్ట్రీ లో ఎదగలేకపోయాడు. ఇప్పటి వరకు ఆయన దాదాపుగా ఆరు సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, ఒక్క హిట్ చిత్రం కూడా రాలేదు. 2004 వ సంవత్సరం లో ‘పల్లకి లో పెళ్లికూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు గౌతమ్. నటుడిగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసాడు, ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా అందులోని పాటలు మంచి హిట్ అయ్యాయి.అలా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్, లేటెస్ట్ గా బ్రేక్ అవుట్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.

- Advertisement -

అయితే గౌతమ్ కి సినిమాలు అనేది కెరీర్ కాదట. ఖాళీ సమయం లో టైం పాస్ కోసం చేస్తుంటాడు అట. అసలు అసలు వృత్తి వ్యాపారం. హైదరాబాద్ లో ఈయనకి ఎన్నో కమర్షియల్ కంప్లెక్స్ లు మరియు ప్రముఖ MNC కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయట. అలాగే బెంగళూరు లో ఈయనకి చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అలా నెల మొత్తానికి కలిపితే ఈ సంపాదన 30 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయి లో సంపాదన వస్తున్నప్పుడు ఇక ఆయనకీ సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఎప్పుడైనా సరదాగా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడు అంతే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here