ఆదివారం రోజు ఒక్క హౌస్ ఫుల్ కూడా నమోదు చేసుకోని ‘ఆదిపురుష్’.. చరిత్రలో ఇదే తొలిసారి!

- Advertisement -

ఈమధ్య కాలం లో ఎంత బడ్జెట్ పెట్టినా , ఎంత టెక్నాలజీ ని వాడినా, ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని పెట్టి తీసిన, కంటెంట్ బాగాలేకపోతే ఆడియన్స్ థియేటర్ వైపు కూడా చూడడం లేదు. అలాగే కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా వసూళ్లు ఎవ్వరూ ఊహించని స్థాయిలోనే ఇస్తున్నారు. చిన్న సినిమాలు కూడా ఇటీవల కాలం లో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపిన సందర్భాలను మనం చాలానే చూసాము.

ఆదిపురుష్
ఆదిపురుష్

అలాగే భారీ బడ్జెట్ మరియు భారీ తారాగణం తో వచ్చిన సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడం చూసాము. అందుకు రీసెంట్ ఉదాహరణ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలైంది. హైప్ కారణంగా మొదటి మూడు రోజులు అద్భుతమైన వసూళ్లను రాబట్టినప్పటికీ నాల్గవ రోజు నుండి మాత్రం అన్నీ ప్రాంతాలలో వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

adipurush

మొదటి మూడు రోజుల్లో 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆ తర్వాత నుండి కేవలం 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది. 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ సినిమాకి ఈ స్థాయి డ్రాప్స్ రావడం ఎవ్వరూ ఊహించలేదు. అయితే కనీసం వీకెండ్ అయినా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తుందిలే, కాస్త రికవర్ అవుతుంది అనుకున్నారు. కానీ వీకెండ్ కూడా ఈ చిత్రానికి డిజాస్టర్ వసూళ్లే వచ్చాయి.

- Advertisement -

ఇక ఆదివారం రోజు అయితే కనీసం ఒక్కటంటే ఒక్క హౌస్ ఫుల్ బోర్డు కూడా పడకపోవడం ఆశ్చర్యార్ధకం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ మరియు 250 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించాలి. కానీ ఆదిపురుష్ చిత్రానికి ఇప్పటి వరకు 182 కోట్ల రూపాయిల షేర్ మరియు 390 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 68 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. అది ఇక దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here