Bigg Boss Telugu లోన కార్తీక దీపంలో చేస్తోన్న శోభ.. వామ్మో.. మరీ ఇంత శాడిజమా..!



Bigg Boss Telugu : పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ లో పోటీ మొదలయ్యింది. అందులో అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిని కంటెడర్లుగా అనౌన్స్ చేశారు బిగ్ బాస్. అప్పటినుంచి ఇతర కంటెస్టెంట్స్‌లో అసూయ, ఆ స్థానంలో తాము లేరనే కోపం.. ఇలా అన్నీ కలిపి ఆ ముగ్గురిని అనర్హులు అని ప్రకటించేలా చేసింది. కానీ శోభా శెట్టి మాత్రం తనను అనర్హురాలు అన్నమాటను ఒప్పుకోలేకపోయింది. అందుకే గౌతమ్‌తో తీవ్రమైన వాగ్వాదానికి దిగింది.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

కొద్ది రోజుల కిందట హోస్ట్ నాగార్జున చూపించిన మీమ్‌ను మరోసారి నిజం చేశారు డాక్టర్ బాబు (గౌతమ్), మోనిత (శోభాశెట్టి). అయితే, ‘కార్తీక దీపం’లో మనసులు కలిస్తే.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. బిగ్ బాస్ ప్లే చేసిన వీడియోలో శోభా శెట్టి ఎప్పుడూ ఒకత్తే కూర్చొని ఉంటుందని, ఎవరితో కలవదని, ఇంటి పనులు చేయదని, వినాయక పూజ సమయంలో తను మేకప్ వేసుకుంటూ కూర్చొని ఎవరు పిలిచినా పట్టించుకోలేదని కారణాలు చెప్పాడు గౌతమ్. అందుకే తను అనర్హురాలని అన్నాడు. ఈ కారణాలు శోభా శెట్టికి చాలా సిల్లీగా అనిపించాయి. అందుకే వీడియో అయిపోగానే చప్పట్లు కొట్టింది.

Shoba

ఆ తర్వాత కుస్తీ పోటీలో తను 57 సెకండ్లు ఉన్నానని, గౌతమ్, శుభశ్రీ అంతసేపు ఉండలేకపోయారని గుర్తుచేసింది. అసలు గౌతమ్ కారణం ఏంటి అని క్లియర్‌గా అడిగి తెలుసుకుంది. వినాయక పూజ గురించి గౌతమ్ చెప్పిన కారణానికి క్లారిటీ ఇచ్చింది. ఆ సమయంలో తాను తేజ మీద అలిగానని, అసలు గౌతమ్‌తో తనకు అంత బాండింగ్ లేదని ముక్కుసూటిగా చెప్పేసింది. ఆ తర్వాత ‘‘జిమ్ చేస్తావు. వర్కవుట్ చేస్తావు. కానీ కుస్తీ పోటీలో నిలబడలేకపోయావు’’ అని రెచ్చగొట్టేలా మాట్లాడింది శోభా. దీంతో గౌతమ్ కూడా సీరియస్ అయ్యాడు.