7 బెస్ట్ తెలుగు మూవీస్‌.. ఓటీటీలో చూసెయ్యండి.. థ్రిల్ ఎంజాయ్ చెయ్యండి

- Advertisement -

కరోనా లాక్ డౌన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఓటీటీ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. ఏమి తోచక తెలుగు , హిందీ , తమిళ్ , ఇంగ్లీష్ , కన్నడ అని తేడా లేకుండా ప్రతీ భాషకి సంబంధించిన వెబ్ సిరీస్ కానీ, సినిమాలు కానీ చూడడం బాగా అలవాటు చేసుకున్నారు జనాలు. ఈ ఓటీటీ ప్రభావం థియేటర్స్ మీద కూడా చాలా బలంగా పడింది. ఇక ఈ ఏడాది ఓటీటీ లోకి ఏకంగా 57 సినిమాలు విడుదల అయ్యాయి. వీటిల్లో మనం మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు 7 ఉన్నాయ్.ఆ 7 సినిమాలేంటో ఒకసారి చూద్దాము.

1) ఫాల్ :

7 బెస్ట్ తెలుగు మూవీస్‌

తెలుగులోకి డబ్ అయిన ఇంగ్లీష్ చిత్రం ఇది, థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాని చూసే ముందు గుండెపోటు పేషెంట్స్ మాత్రలు పక్కన పెట్టుకొని మాత్రమే చూడండి.ఎందుకంటే ఇది ఆ రేంజ్ థ్రిల్ మరియు టెన్షన్ కి గురి చేసే సినిమా.కథ విషయానికి వస్తే ఇద్దరు అమ్మాయిలు క్రేజీ అడ్వెంచర్ చెయ్యడం కోసం, 2000 అడుగులు ఎత్తు ఉన్న టీవీ టవర్ ఎక్కుతారు. కానీ క్రిందకి వచ్చే మార్గాలు అన్నీ మూతపడుతాయి. అప్పుడు వాళ్లిద్దరూ చివరికి క్రిందకి ఎలా వచ్చారు అనేదే స్టోరీ.కాస్త స్లో న్యారేషన్ లో స్టోరీ నడిచినప్పటికీ థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు లో కూడా అందుబాటులో ఉంది.

- Advertisement -

2) మాలికాపురం :

ముకుందన్
ముకుందన్

ఉన్నిముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళం లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక చిన్నారి శబరిమలై కి వెళ్ళాలి అనే కోరికతో, ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరుతుంది. ఈ ప్రయాణం లో ఆమెకి ఎదురైనా సంఘటనలే సినిమా. స్టోరీ వింటుంటే మనకి ‘దేవుళ్ళు’ సినిమా గుర్తుకువస్తాది కానీ, ఇది పక్కా కమర్షియల్ సినిమా.ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

3) సెంబి :

లేడీ కమెడియన్ కోవై సరళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కింది. కోవై సరళ కేవలం కామెడీ మాత్రమే కాదు, ఎమోషన్స్ తో కూడా ఆడియన్స్ తో హృదయాలతో కబడ్డీ ఆదేసిందనే చెప్పాలి. ఒక ఊరిలో కోవై సరళ మరియు ఆమె మనవరాలు నివసిస్తూ ఉంటారు, ఒక రోజు ముఖ్యమైన పని కారణం గా ఇద్దరు బస్సులో ప్రయాణం అవుతారు.ఈ బస్సు ప్రయాణం వాళ్ళిద్దరి జీవితం లో సరికొత్త మలుపు ని తిప్పుతుంది.ఆ మలుపు వల్ల వీళ్ళ జీవితాలు ఎలా మారాయి అనేదే స్టోరీ. ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు లో కూడా అందుబాటులో ఉన్నది.

4) కొరమేను:

ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ శత్రు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది,రొటీన్ కమర్షియల్ సినిమాలను చూసి చూసి విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక ఫెస్టివల్ లాంటిది అనే చెప్పాలి. మీసాల రాజు అనే పోలీస్ ఆఫీసర్ వైజాగ్ కి ట్రాన్స్ఫర్ కాగానే తన మీసాలను ఎవరో కట్ చేస్తారు, ఆ కట్ చేసింది ఎవరు అనేదే సినిమా ప్లాట్. థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ విషయం లో ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ ని నూటికి నూరు శాతం సంతృప్తి పరుస్తుంది.చివరి 30 నిముషాలు అయితే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అనే చెప్పాలి.ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

5) ఇరాట :

మలయాళం స్టార్ జియో జార్జ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాని థ్రిల్లర్ మూవీ లవర్స్ కచ్చితంగా చూడాల్సిందే. పోలీస్ అధికారికి పోలీస్ సెరిమొనీ జరుగుతున్న సమయం లో పోలీస్ స్టేషన్ లో SI మర్డర్ జరుగుతుంది.ఈ మర్డర్ ఎవరు చేసారు అనేదే స్టోరీ, క్లైమాక్స్ ట్విస్ట్ కి మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

6) వినరో భాగ్యము విష్ణు కథ :

కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది థియేటర్స్ లో విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ గా నిల్చింది. ఫోన్ నైబరింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా చాలా ఆసక్తిగా, ట్విస్టులతో సాగిపోతుంది.ఎంటర్టైన్మెంట్ తో పాటుగా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ కూడా పుష్కలంగా ఉన్న ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) రైటర్ పద్మభూషణ్ :

సుహాస్ హీరో గా నటించిన ఈ చిత్రం కూడా, ఈ ఏడాది థియేటర్స్ లో విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది.గొప్ప రైటర్ అవ్వాలనే తపనతో హీరో ఎన్నో పుస్తకాలూ రాస్తాడు, కానీ ఒక్క కాపీ కూడా సేల్ అవ్వద్దు.సరిగ్గా అలాంటి సమయం లోనే అతని పేరుతో , అతని ఫోటో తో ఒక అజ్ఞాతవాసి పుస్తకం రాస్తారు, ఆ పుస్తకం వల్ల పద్మభూషణ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది.ఇంతకీ తన పేరు మీద పుస్తకం రాసిన ఆ వ్యక్తి ఎవరు అని కనుక్కోవడమే సినిమా స్టోరీ.కామెడీ ,సెంటిమెంట్ మరియు లవ్ ట్రాక్ అన్ని చక్కగా అమర్చబడ్డ సినిమా ఇది.జీ 5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here