Waltair Veerayya : ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ కాలం లో రీమేక్ సినిమాలను ప్రేక్షకులను రిజెక్ట్ చేసేస్తున్నారు.. టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ రాని పరిస్థితి నెలకొంది..అందుకు బెస్ట్ ఉదాహరణగా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రాలు..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ ‘లూసిఫెర్’ కి రీమేక్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం గత ఏడాది దసరా కానుకగా విడుదలై పాజిటివ్ రివ్యూస్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
పాజిటివ్ రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి కానీ , కలెక్షన్స్ రాలేదు..దానికి ప్రధాన కారణం రీమేక్ నెగటివిటీ..ఈ చిత్రం మలయాళం సినిమాకి రీమేక్ అని బాగా ప్రచారం అయిపోయింది..అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ని కూడా అప్లోడ్ చేసి ఉన్నారు..అందరూ చూసేసారు కూడా, అలాంటి సినిమాని రీమేక్ చేస్తే కలెక్షన్స్ ఎక్కడి నుండి వస్తాయి..మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఆ మాత్రం వసూళ్లు అయినా వచ్చాయి అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అయితే ‘గాడ్ ఫాదర్’ బాగా ఆడకపొయ్యేసరికి అందరూ చిరంజీవి కి వయస్సు అయిపోయింది..ఇక ఆయన సినిమాలు ఎవరూ చూడరు అనే ప్రచారం బాగా చేసారు దురాభిమానులు..కానీ మూడు నెలలు కూడా తిరగకముందే మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో కేవలం వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి, ఆల్ టైం నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ కొట్టే దిశగా ముందుకు దూసుకుపోతున్నాడు.
ఈ రెండు సినిమాలకు ఇంత వ్యత్యాసం కి కారణం, ‘గాడ్ ఫాదర్’ అనేది రీమేక్, ‘వాల్తేరు వీరయ్య‘ అనేది డైరెక్ట్ సినిమా..ఈ చిన్న తేడా రెండు సినిమాల మధ్య ఎన్ని కోట్ల రూపాయిలు తేడా ఉందో చూసారా.. అందుకే స్టార్ హీరోలు ఇక నుండి రీమేక్స్ జోలికి పోకుండా ఉండడమే మంచిది..మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం ‘భోళా శంకర్’ కూడా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ సినిమాకి రీమేక్..ఈ సినిమా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.