Bobby Simha : తెలుగు వాడైనా.. తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా. టాలీవుడ్లో ఆయన ఇటీవలచిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బాబీ సింహ చాలా కాలం కిందటే ఇక్కడే స్థిరపడిపోయాడు. ప్రస్తుతం తాను చెన్నైలోని కొడైకెనాల్ లో ఓ ఇంటిని కట్టుకుంటున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా బాబీ సింహకు స్నేహితుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నట్లు కొన్నా్ళ్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. వీటిపై బాబీ తాజాగా స్పందించారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తాను తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుండడంతో చెన్నైలోని స్థిరపడాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ఇక్కడే ఓ ఇళ్లు కట్టుకోవాలని భావించాడట. తమిళనాడులో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉసేన్ అనే వ్యక్తి బాబీ సింహకు మంచి స్నేహితుడు. అయితే ఉసేన్.. జమీర్ అనే బిల్డింగ్ కాంట్రాక్టర్ తో ఇంటి నిర్మాణం కోసం రూ.కోటి 30 లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఇల్లు పూర్తి చేయకపోగా, మరిన్ని డబ్బులు ఇవ్వాలని ఉసేన్, జమీర్ ఇద్దరూ కలిసి నటుడు బాబీ సింహను డిమాండ్ చేశారు. దీంతో విసిగి పోయిన బాబీ సింహ.. తనకు న్యాయం చేయండంటూ పోలీసులకు ఆశ్రయించాడట. విషయం తెలిసిన ఉసేన్, జమీర్ ఇద్దరు నటుడు బాబీ సింహను చంపుతామని ఎదురు తిరిగారు. ఈ విషమంపై బాబీ సింహ కోర్టును ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ జమీర్, అతని స్నేహితుడైన ఉసేన్ ఇద్దరి నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయిని బాబీ సింహా కోర్టులో వివరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతోంది.