Chiranjeevi : డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన గిఫ్ట్!

- Advertisement -

Chiranjeevi : సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్యగా దిగి మెగాస్టార్ చిరంజీవి కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు రూ.139 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇక యూస్ లోనూ ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Chiranjeevi
Chiranjeevi

ఒక అభిమాని తన అభిమాన హీరోతో సినిమా తీస్తే.. మిగతా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో.. ఆ సినిమాను ఏ రేంజ్ లో హిట్ చేస్తారో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రపంచం చూస్తోంది. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా.. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ఆకట్టుకుంటోంది.

bobby and chiru
bobby and chiru

“చిరంజీవి గారికి ఉన్న లక్షలమంది అభిమానుల్లో నేనూ ఒకడిని. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన సినిమాలో పనిచేయాలని ఉండేది. దాదాపు 20ఏళ్ల తర్వాత ఏకంగా ఆయనను డైరెక్ట్‌చేసే అవకాశం లభించింది. ఒక అభిమానిగా, మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారో దాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశానని” ఇప్పటికే బాబీ చెప్పారు.

- Advertisement -

ఇదిలా ఉంటే, ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే డైరెక్టర్ బాబీ తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణంతో గుప్పెడంతో శోకంలో ఉన్నప్పటికీ షూటింగ్ ఆలస్యం కాకుడదనే ఉద్దేశ్యంతో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రీకరణకు హాజరయ్యారు. సినిమాపై తనకున్న అంకిత భావానికి తాను ఫిదా అయ్యానని మెగాస్టార్ ఇప్పటికే సినిమా ప్రమోషన్లలో భాగంగా చెప్పారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు బాబీకి ఊహించని బహుమతి ఇచ్చినట్లు సమాచారం.

సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన బాబీకి మెగాస్టార్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారట. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ కావడంతో ఆయనను స్వయంగా తన ఇంటికి విందుకు ఆహ్వానించడమే కాకుండా భోజనం ముగిశాక లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు టాక్. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

అయితే ఈ అంశంపై మన మెగాస్టార్ కానీ.. దర్శకుడు బాబీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇందులో నిజం తెలియాలంటే ఇద్దరిలో ఎవరొ ఒకరి నుంచి స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రం కాసులవర్షాన్ని కురిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ మెగాస్టార్‌ను చూస్తున్నామని అభిమానులు అంటున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేశారు. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషించారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here