Virat Anushka Wedding Anniversary క్రికెట్, సినిమాకు మధ్య విడదీయరాని బంధం ఉంది. అందుకే ఏళ్ల నుంచి ఈ రెండు రంగాల మధ్య సెలబ్రిటీలకు మధ్య కూడా ఓ అనుబంధం ఏర్పడింది. క్రికెటర్లను ప్రేమించిన హీరోయిన్లు, క్రికెటర్లను పెళ్లాడిన బ్యూటీస్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌కు, క్రికెట్‌కు మధ్య ఓ ఫెవికల్ రిలేషన్షిప్ ఉందని చెప్పొచ్చు. యువరాజ్ సింగ్-హేజల్ కీచ్, హర్భజన్ సింగ్-గీతా బస్రా, జహీర్ ఖాన్-సాగరిక, విరాట్ కోహ్లి-అనుష్క శర్మ. బాలీవుడ్లో అయినా.. క్రికెట్ ఫీల్డ్ అయినా పవర్ కపుల్ ఎవరనే టాపిక్ వస్తే ఫస్ట్ వచ్చే పేరు విరాట్ కోహ్లి-అనుష్క శర్మ.
ఫ్యాన్స్‌కు ఈ కపుల్ అంటే యమ క్రేజీ. వీళ్లిద్దరు కలిసి ఒక చోట కనిపిస్తే ఇటు మీడియాకు అటు ఫ్యాన్స్‌కు పండగే. సోషల్ మీడియాలో ఆ రోజు మొత్తం విరుష్క(విరాట్+అనుష్క) ఫొటోలతో నిండిపోతుంది. బ్యూటిఫుల్, వావ్, స్వీట్ కపుల్, క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ బాక్స్ నిండిపోవాల్సిందే. ఇక వీళ్లిద్దరే తమ పర్సనల్ లైఫ్ గురించి పోస్టు పెడితే.. ఇక ఆ పోస్టుకు లెక్కలేనన్ని లైకులు, షేర్లు వస్తాయి.
సరిగ్గా ఐదేళ్ల క్రితం టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇవాళ తమ ఐదో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటోంది ఈ జంట. ఈ ఆనంద సమయంలో తన మనసులోని మాటను సతీమణి అనుష్కకు విషెస్ రూపంలో చెప్పాడు కింగ్ కోహ్లీ. అనుష్క కూడా ఈ ఐదేళ్లలో తమ లైఫ్‌లో జరిగిన ఐదు అద్భుతాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి తన భర్త విరాట్‌కు యానివర్సరీ విషెస్ చెప్పింది. ఈ ఇద్దరి పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఐదేళ్ల వివాహ బంధాన్ని ప్రతిక్షణం ఆస్వాదించిన విరుష్క జంట ఇవాళ్టితో ఆరో ఏడులోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో ఈ క్యూట్ పెయిర్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పవర్ కపుల్ ఫొటోలు షేర్ చేస్తూ మీ జంట ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలంటూ శుభాభినందనలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఈ జంట కూడా ఒకరికొకరు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పుకున్నారు.
విరాట్ తన లైఫ్ పార్టనర్ అనుష్కకు యానివర్సిరీ విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. “అంతులేని ప్రయాణంలో ఐదేళ్ల కాలం. నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నా మనసంతా నువ్వే, నీపై నా ప్రేమ అజరామరం” అంటూ విరాట్ తన మనసులోని మాటను బయట పెట్టేశాడు. జీవితంలో తనకు దక్కిన గొప్ప గిఫ్ట్‌గా అనుష్కను అభివర్ణించాడు కోహ్లీ.
ఇక అనుష్క కూడా కోహ్లీపై తన ప్రేమను.. ఐదేళ్ల తమ వివాహ బంధాన్ని తనదైన శైలిలో సోషల్ మీడియాలో పంచుకుంది. ముందుగా విరాట్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది ఈ క్యూటీ. దీనికి మై లవ్ అంటూ కోహ్లీ రిప్లై ఇచ్చారు. వావ్ .. సూపర్ జోడీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక విరాట్ పోస్టుపై అనుష్క కూడా స్పందించింది. అనుష్క సోషల్ మీడియాలో ఎక్కువగా నాటీగా ఉంటుంది. ఇప్పుడు విరాట్ పోస్టుకు రిప్లై కూడా నాటీగానే ఇచ్చింది. థాంక్ గాడ్ నాపై రివేంజ్ తీర్చుకుంటావనుకున్నా అంటూ పోస్టు పెట్టింది. రివేంజ్ ఎందుకంటే.. అనుష్క పోస్ట్ చేసిన ఫొటోల్లో విరాట్ చిత్రవిచిత్రమైన పోజులు ఇచ్చాడు. అందుకే కోహ్లీ కూడా తనపై రివేంజ్ తీర్చుకోవడానికి తన ఫొటోలు కూడా పోస్టు చేస్తాడని భావించి అలా కామెంట్ చేసింది.